ఆకస్మిక తనిఖీలు చేసిన జిల్లా వైద్యాధికారిణి…

ఆకస్మిక తనిఖీలు చేసిన జిల్లా వైద్యాధికారిణి…

వెల్దుర్తి మార్చి 09 (అఖండ భూమి) :

వెల్దుర్తి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలను ఆదివారం జిల్లా వైద్యాధికారిణి డి ఎం ఎన్ హెచ్ ఓ శాంతి కల ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్దుర్తి ప్రభుత్వ వైద్యశాలలో విష జ్వరాలతో, డయేరియా ప్రాబ్లంతో వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగులను పరిశీలించడం జరిగింది. డయేరియా కు సంబంధించిన ఫైల్ ఏర్పాటు చేయాలని సూచించారు. వైద్యశాల నందు రోగుల జాబితాను పరిశీలించడం జరిగింది. వచ్చిన రోగులకు సరైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. విష జ్వరాలు పై అప్రమత్తంగా ఉండాలి రోగులకు సూచనలు ఇవ్వడం జరిగింది. అనంతరం మండలంలోని రత్నపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని తనిఖీలు నిర్వహించారు. గ్రామంలో ప్రజలు రోగాల పట్ల అప్రమత్తంగా ఉండి వైద్యులను కలవాలని తెలిపారు. డిఎంహెచ్వో శాంతి కల, డి ఐ ఓ నాగ ప్రసాద్,

ఎఫ్ డి పి నోడల్ ఆఫీసర్ రఘు, డాక్టర్ ఎం వి భువన తేజ, మలేరియా సబ్ యూనిట్ అధికారి వెంకటేశ్వర్లు,

హెల్త్ సూపర్వైజర్ ఆర్ అనమ్మ,హెల్త్ సూపర్వైజర్ మోహన్, సర్పంచ్ కళ్ళ పకీరమ్మ, గ్రామ పెద్దలు సుధాకర్

సామాజిక ఆరోగ్య అధికారి తదితరులు ఉన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!