మున్సిపల్ వాటర్ ముద్దు… మినరల్ వాటర్ వద్దు..
ఎస్ సి ఆర్డబ్ల్యూఎస్ కర్నూలు.
వెల్దుర్తి మార్చి 09 (అఖండ భూమి) : మున్సిపల్ వాటర్ తాగాలని, మినరల్ వాటర్ తాగవద్దని ఎస్ సి ఆర్డబ్ల్యూఎస్ కర్నూలు జిల్లా అధికారి బి నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం వెల్దుర్తి ప్రభుత్వ వైద్యశాలలో నందు వాంతులు, బేదులు, విరేచనాలతో చికిత్స పొందుతున్న పేషెంట్లను పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యశాల నందు హాస్పటల్ సిబ్బందిని డయేరియా లక్షణాలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఎన్ని గ్రామాల నుండి హాస్పటల్ నందు అడ్మిట్ అయ్యారు అని డాక్టర్ల తో మాట్లాడారు. వెల్దుర్తి పట్టణంలో కాలువలు శుభ్రంగా ఉన్నాయా లేదా అని గ్రామ ప్రజలను అడిగారు. గ్రామంలో వారానికి ఒక్కసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతుందని తెలిపారు. వెల్దుర్తి పట్టణానికి చెందిన ఆర్డబ్ల్యూఎస్, యు ఆర్ డి లకు తాగునీటి సమస్యలను సిఫారసు చేసి నేటి సమస్య లేకుండా చూస్తామని తెలిపారు.