చొప్పెల్ల గ్రామ దేవత శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర నేడు, రేపు తీర్థం.

చొప్పెల్ల గ్రామ దేవత శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర నేడు, రేపు తీర్థం.

 

ఆలమూరు (అఖండ భూమి) :డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్ల గ్రామంలో వేంచేసియున్న గ్రామ దేవత శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర ఈ రోజు గురువారం రాత్రి అత్యంత ఘనంగా జరపడానికి ఆలయకమిటీ వారు ఏర్పాట్లు చేసినారు. అలాగే రేపు శుక్రవారం నాడు అమ్మవారి తీర్థం జరుగుతుంది. ప్రతీ సంవత్సరం జేష్ఠమాసంలో నెలపొడుపు రోజు అమ్మవారి గరగని ఎత్తుతారు, పౌర్ణమి వరకు పదిహేను రోజుల పాటు అమ్మవారిని గరగ రూపంలో గ్రామోత్సవంగా ఊరేగింపుతో గ్రామస్థులకు అమ్మవారి దర్శనభాగ్యం.పౌర్ణమి ముందు రోజు అత్యంత ఘనంగా అమ్మ వారి జాతర.జాతర రోజు రాత్రి చిన్న పిల్లల్ని తీసుకువచ్చి ఆలయ ఆవరణలో వారిచే కాగడాలు వెలిగిస్తారు. పౌర్ణమి రోజు అమ్మవారి తీర్థ మహెూత్సవం అత్యంత ఘనంగా జరుగుతాది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని అమ్మవారిని దర్శించుకుంటారని ఆలయ కమిటీవారు తెలిపారు. జాతర, తీర్థ మహోత్సవాలు జరిగే సమయంలో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా ఆలమూరు పోలీసు వారు ప్రతీ సంవత్సరం తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కోరిన కోర్కెలు తీర్చె చల్లని తల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు అని భక్తులు,గ్రామస్థుల నమ్మిక.
అత్యంత శరవేగంగా అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులు.
ఈ సంవత్సరం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం అత్యంత ఘనంగా జరుగుతుంది. భక్తులు, దాతలు ఇచ్చె విరాళాలతో ఆలయ నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఆలయ నిర్మాణం శ్లాబ్ పూర్తయినది. ఈ సంవత్సరం అమ్మవారి ఉత్సవాలకు, దర్శనానికి వచ్చె భక్తులు ఆలయ నిర్మాణ పనులు చూస్తారని, మరింత మంది విరాళాలు ఇచ్చి ఆలయ నిర్మాణం అత్యంత సుందరంగా రూపుదిద్దుకొనుటకు సహకరిస్తారని కమిటీవారి అంచనా. వీలైనంత తొందరగా అమ్మవారి ఆలయం నిర్మాణం పూర్తయ్యి, ఆలయం ప్రారంభోత్సవం భారీ ఎత్తున అత్యంత వైభవంగా జరుగుతాదన్న ఆశాభావాంతోను, నమ్మకంతో ఉన్నామని ఆలయ నిర్మాణ కమిటీవారన్నారు.

Akhand Bhoomi News