సిపిఐ పార్టీ పునర్ వైభవానికి కృషి చేయాలి

 

 

 

రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలేపల్లి వెంకటరమణ

 

కొయ్యూరు అఖండ భూమి జూన్ 19 అల్లూరి జిల్లా భారత కమ్యూనిస్టు పార్టీ పునర్ వైభవానికి కార్యకర్తలంతా సమిష్టిగా కృషి చేయాలని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలేపల్లి వెంకటరమణ పేర్కొన్నారు బుధవారం స్థానిక గిరిజన భవనంలో భారత కమ్యూనిస్టు పార్టీ మండల సమితి సమావేశం ఉల్లి సూరిబాబు అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా బాలేపల్లి వెంకటరమణ మాట్లాడుతూ పార్టీ నిర్మాణం భవిష్యత్తు కార్యచరణ కోసం పార్టీకి కష్టపడి పని చేయాలని ప్రజాసంఘాలు బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అల్లూరు సీతారామరాజు జిల్లా పార్టీ కార్యదర్శి పోట్టిక సత్యనారాయణ మాట్లాడుతూ అల్లూరి జిల్లాలో 22 మండలాల్లో సిపి పార్టీని బలోపేతం చేయడానికి అందరూ రాత్రి పగలు కష్టపడి పని చేయాలని అప్పుడే గిరిజన ప్రాంతం సమస్యల పరిష్కరించే ఆవశ్యకత ఏర్పడుతుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఇరవాడ దేముడు మండల సహాయ కార్యదర్శి పొట్టిక మల్లేష్ కస్తూరి రమేష్ జిల్లా మహిళా అధ్యక్షురాలు వంతల లక్ష్మి జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు వియ్యపు నానాజీ గిరిజన సమస్య మండల కార్యదర్శి పోట్టుకూరి దార మల్లేష్ అధ్యక్షుడు మొల్ల నాగరాజు మాజీ సర్పంచ్ గుమ్మ రాంబాబు అల్లం లక్ష్మి ఇరవాడ రాజు గండేపల్లి నూకరాజు మాదల సత్యనారాయణ రావణా పల్లి ఎంపీటీసీ ఇరవాడ సత్యవేణి సుర్ల నూక రత్నం సుర్ల పెంటమ్మ తదితరులు పాల్గొన్నారు

Akhand Bhoomi News