చొప్పెల్లలో అత్యంత జనాదారణతో టిడిపి విజయోత్సవ పాదయాత్ర.

చొప్పెల్లలో అత్యంత జనాదారణతో టిడిపి విజయోత్సవ పాదయాత్ర.

 

ఆలమూరు (అఖండ భూమి):సార్వత్రిక ఎన్నికల్లో కొత్తపేట నియోజకవర్గంలో ఉమ్మడి టిడిపి శాసనసభ్యునిగా బండారు సత్యానందరావును అఖండ మెజారిటీతో గెలిపించిన విధానాన్ని టిడిపి మండల అధ్యక్షుడు మెర్ల గోపాల స్వామి ప్రజా విజయంగా అభివర్ణించారు. కూటమి అభ్యర్థుల విజయానికి కృతజ్ఞతగా ఆలమూరు మండలంలోని చొప్పెల్ల ప్రజానికాన్ని అభినందిస్తూ టిడిపి మండల అధ్యక్షుడు మెర్ల గోపాలస్వామి ఆధ్వర్యంలో విజయోత్సవ పాదయాత్ర బుధవారం భారీ ఎత్తున పార్టీ శ్రేణులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ముందుగా కనకమహాలక్ష్మి అమ్మవారి గుడిసెంటర్లో ఉన్న జాతిపిత మహాత్మగాంధి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి విజయోత్సవ యాత్రను ప్రారంభించారు. అలాగే విజయోత్సవ పాదయాత్రలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళర్పించారు. ఆలమూరు మండలం మొత్తం మీద టిడిపికి అత్యధిక మెజారిటీ వచ్చిన సందర్భంగా టిడిపి మండల అధ్యక్షుడు మెర్ల గోపాల స్వామిని టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు

ఘనంగా సత్కరించారు. అనంతరం గ్రామంలో ఎన్డీయే కూటమి విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతూ ఆధ్యంతం ఆనందోత్సవాల మధ్య వందలాది మందితో బాణాసంచా కాల్పులతో, తీన్ మారు డప్పులతో, డిజె సౌండ్స్ తో విజయోత్సవ పాదయాత్ర ఉదయం నుండి మొదలై మధ్యహ్నం భోజన విరామం వరకు తదుపరి మళ్ళీ మొదలై రాత్రి 7 గంటల వరకు కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంగా మెర్ల గోపాల స్వామి మాట్లాడుతూ అమలాపురం ఎంపిగా గంటి హరీష్ మాధూర్, కొత్తపేట ఎమ్మెల్యేగా బండారు సత్యానందరావుల గెలుపులో ఓటరు పాత్ర ఈసారి అమోఘం అన్నారు. ఉమ్మడి పార్టీ గెలుపు ప్రజా విజయంగా ఆయన పేర్కొన్నారు. గ్రామమంత తిరిగి ప్రతి ఒక్కరిని పలకరించి ఎన్డీయే కూటమికి విజయాన్నందించినందుకు అందరికి నాయకులు ధన్యవాదములు తెలిపారు. ఈ విజయోత్సవ పాదయాత్రలో గ్రామస్థులు, కూటమి అభిమానులు, మహిళలు నాయకులకు మంగళహారతులు ఇచ్చి అపూర్వ అభిమానాన్ని కురిపించారు. చాలా చోట్ల నాయకులకు పూలమాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నేతలు ఆకుల రామకృష్ణ, సకుమళ్ల రాముడు, మద్ది పట్టాభి,బళ్ల హరికృష్ణ,జాంపోలు వెంకట్రావు, ఆకుల అన్నవరం, కొత్తపల్లి రాంబాబు, సుంకర కామరాజు, అనుసూరి ఆంజనేయులు, వెత్స సుబ్బారావు, కొత్తపల్లి కృష్ణ, ఆకుల రాజు, సోము రాంబాబు, రాయుడు లక్ష్మణరావు, గుండుమళ్ల రాంబాబు, సకుమళ్ల నాగేశ్వర్రావు, మెర్ల శ్రీను, నందపనేడి శ్రీను, పెద్ద ఎత్తున టిడిపి నాయకులు, కార్యకర్తలు, వందలాది అభిమానులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News