నిషేధిత విత్తనాల పట్టివేత

 

 

నిషేధిత విత్తనాల పట్టివేత

బెల్లంపల్లి మార్చి 03(అఖండ భూమి వెబ్ న్యూస్): మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని మల్లిడి క్రాస్ రోడ్ వద్ద సోమవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్ర వాహనంపై వస్తున్న ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి ఒక వ్యక్తి పారిపోతుండగా మిగతా ఇద్దరు అటువైపు నుండి వస్తున్నారు.వారిని బైక్ పై మూట లో ఏముంది అని అడగగా సమాధానం చెప్పలేకపోవడంతో అట్టి మూటను చెక్ చేయగా అందులో నిషేధిత పత్తి విత్తనాలు ఉండడంతో వారిని విచారించగా పురుషోత్తం అలాగే గుంటూరుకు చెందిన సురేష్ తోపాటు

అతని గ్రామానికి చెందిన రాజన్న ఇంట్లో మూడు క్వింటాళ్ల విత్తనాలు ఉన్నాయని చెప్పడంతో భీమిలి ఎస్సై విజయ్

పోలీసు సిబ్బందితో అక్కడికి చేరుకొని విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపారు.పత్తి విత్తనాలను పట్టుకోవడంలో చక్కచక్యంగా వ్యవహరించిన భీమిని ఎస్సైని పోలీసు సిబ్బందిని బెల్లంపల్లి ఎసిపి రవికుమార్ అభినందించారు…

Akhand Bhoomi News

error: Content is protected !!