చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి. తుగ్గలి జూలై 28 అఖండ భూమి న్యూస్ :-
స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో పలు అంశాలపై, చ ట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎఫ్ఐ ఆర్, సివిల్, క్రిమినల్ చట్టాల మధ్య తేడాలు, బెయిల్ అంటే ఏమిటి? అనే అం శాలతో పాటు పోక్సో చట్టం, రోడ్డు ప్రమాదాలు, సైబరు క్రైమ్‌వంటి అంశాలపై అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడుపరాదని సూచించారు. ఒకవేళ ఏమైనా సమస్యలు ఎదురైతే 1930 నంబరుకు ఫోన్‌ద్వారా సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. సమావేశంలో హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, పోలీసులు శ్రీనివాసులు, హరిబాబు, నారాయణస్వామి, తుగ్గలి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.