వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులకు న్యాయం జరిగేనా! ఎపి.గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి కూడ రాధాకృష్ణ-

 

కొయ్యూరు అల్లూరి జిల్లా
(ఆఖండ భూమి)

ఏళ్ల తరబడి పింఛన్ తీసుకున్నా వాలంటీర్లు చేసిన తప్పుడు సర్వేల వల్ల నిలిచిపోయిన పెన్షన్లు తిరిగి ఆరుగురు వృద్ధులకు తక్షణమే పునరుద్ధరించాలి. ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి కూడ రాధాకృష్ణ కోరారు ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ అల్లూరి జిల్లా పాడేరు మండలం చప్పిపుట్టు గ్రామంలో (పివిటిజి) కుటుంబాలకు చెందిన
మర్రి బుటిలి పండన్న( 73 ) (కళ్ళు కనబడదు) . మర్రి చిత్రో ( 74) మర్రి పులిమే ( 69) మర్రి నిసో (69 )కోర్ర జింబ్లో ,చెంబో పాంగి చిరు (68 ) ఆరుగురు వృద్ధులు కొద్దిమంది భర్తలు కోల్పోయారు. మరొకరికి కళ్ళు కనబడదు. అయితే ఈ ఆరుగురు వృద్ధాప్య పింఛన్ 200రూపాయల నుండి 2,250/- రూపాయల వరకు. సెప్టెంబర్ 2021 సంవత్సరం వరకు పింఛన్ ఇచ్చే వారనికానిఅదే సంవత్సరం అక్టోబర్ నెలలో పింఛన్ ఆపేసారన్నారు గతంలో వాలంటీర్లు తప్పుడు సర్వేల వల్ల మాకు పించన్ ఆపేసారని బాధితులు వాపోతున్నారు. వృద్ధులు అధికారుల చుట్టూ అనేక మారులు తిరిగిన పింఛన్ రాకపోవడంతో వృద్ధాప్యంలోఅనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. వారు వృద్ధులు కావడం భర్తలు కోల్పోవడం, అటు పింఛన్ ఆపేయడంతో, బ్రతుకు భారంగా మారి, దిక్కుతోచని నిసహాయ పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. కొద్దిమంది తప్పుడు సర్వేలతో పింఛన్ను కోల్పోయిన ఆరుగురికి తక్షణమే పింఛన్ పునరుద్ధరించాలని , అధికారులు చుట్టూ ఆఫీసు ల చుట్టూ తిరగలేని పరిస్థితుల్లో ఉన్న ఆ వృద్ధుల దగ్గరకు అధికారులు వెళ్లి పూర్తిస్థాయి విచారణ జరిపించి వారికి పింఛన్ పునరుద్ధరించేల చర్యలు తీసుకోవాలని రాధాకృష్ణ విజ్ఞప్తి చేశారు.

Akhand Bhoomi News

error: Content is protected !!