రాఖీ పండుగ అంటే ఏమిటి?కుడి చేతుకే రాఖీ ఎందుకు కడుతారు?
కవి,లెక్చరర్ ఉమాశేషారావు వైద్య.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఆగస్టు 18,(అఖండ భూమి).
రక్ష అంటే రక్షణ ,బంధన్ అంటే సంబంధం అందుకే ఈ పండు గకు రక్షాబంధనం పేరు వచ్చిం ది.సోదరి తన సోదరుని చేతికి పవిత్రమైన దారం కట్టేటప్పుడు దీర్ఘాయువు, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తుంది.సోదరుల సురక్షి తమైన సంతోషకరమైన జీవి తాన్ని కొనసాగించాలని ఈ పండుగ ఉద్దేశం. సోదరులు జీవితాంతం రక్షణగా ఉంటార ని దీని ప్రధాన ఉద్దేశం. అయి తే కుడి చేతికే రాఖీ కట్టడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. హిందూ మతంలో ఎడమ చేతికి చెడు అనే అర్థం ఉంది అశుభంగా పరిగణిస్తారు. అ యితే ఇది మూఢ నమ్మకంగా కొందరు అనుకుంటారు .కానీ దీనికి ఆధ్యాత్మికంగా సైన్స్ పరంగా కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. భారతీయులు ఎడ మచేతిని శుభ్రపరచే ప్రయోజ నాల కోసం వినియోగిస్తారు. హిందువులు చెప్పుకునే సవ్య, అపసవ్య విశాల ప్రకారం సవ్య దిశ విశ్వాసానికి అనుగుణంగా ఉంటుంది. అపసవ్య దిశ నెగి టివ్ ఎనర్జీగా భావిస్తారు. తమి ళ సాహిత్యంలో కుడి చేతికి రాఖీ ఎందుకు ఎందుకు కట్టా లో ఒక కారణం ఉంది.పులులు సాధారణంగా ఎడమవైపు కా కుండా కుడివైపున పడే వేటను మాత్రమే తింటాయి.తమిళ సంస్కృతిలో కుడివైపు ఎడమ కంటే ఎక్కువ బరువు ఉంటుం ది. చాలా సంస్కృతులో, భాష ల్లో కుడిని అదృష్టంగాను, ఎడుమను దురదృష్టం గాను భావిస్తారు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం కుడి చేతికి వందనం కట్టడం ద్వారా వాత, పిత్త, కాపం నియంత్రణలో ఉంటా యని చెబుతారు. ఆయుర్వేద నిపుణులు సోదర రాఖీ కట్టిన ప్పుడు ఈ మూడు శరీరంశాలు క్రమబద్ధీకరించబడిన ఆరోగ్యం మెరుగుపడుతుంది. నాడీ శా స్త్రం ప్రకారం మానవ శరీరం లో ఇడా,,పింగళ, సుషూమన, ఈ మూడింటిలో పింగళి నాడి కు డివైపున ఉంటుంది. ఇది పురు షత్వంతో సంబంధం కలిగి ఉంటుంది.మగవారిలో పింగళి నాడి చైతన్యవంతం అయితే పురుషాధిక్యత ఎక్కువగా ఉంటుంది. అందుకే సోదరులు కుడి చేతికి రాఖీ కట్టాలి అని చెప్తారు. సోదరుడి మణికట్టుపై రాఖీ కట్టేటప్పుడు సోదరీమ ణులు జపించవలసిన మంత్రం
యేన బద్ధో బలి రాజా దానవేంధ్రో మహాబలః
తెనత్వామభి బద్నమి రక్షే మా చల మాచల!కొన్ని వర్గాల ప్రజ లు జంధ్యాలు వేసుకుంటారు. పెళ్లి అయిన వారు మూడు పొగలు,వడుగు అయిన వారు ఒక పోగు వేసుకుంటారు. దీన్ని బ్రహ్మ సూత్రం అని కూడా అం టారు.యజ్ఞోపవితం పరం పవిత్రం ప్రజాపతేర్యత్స హజం పురుస్థాత్ ఆయుష్య మగ్ర యo ప్రతి ముంచ శుభ్రం యజ్ఞోపవితం బలమస్తు తేజః అని యదా శక్తి గాయత్రి మం త్రం చదవాలి. “నీవు నాకు రక్ష నేను నీకు రక్ష మనిద్దరం దేశానికి రక్ష.”ప్రకృతి రక్ష కు కూడా రక్ష కట్టి రక్షిద్దాం.మరొక ముఖ్య విషయం సోమవారం 19 వ తేదీ పౌర్ణిమ వస్తుంది పండితుల ప్రకారం ఆ రోజు ఉదయం 5.53 నిమిషాల నుండి 1.33 నిమిషాల వరకు భద్రకాలం అందుకే రాఖీ లు కట్టే వారు మధ్యాహ్నం 1.33 నిమిషాల నుండి రాత్రి 9.08 నిమిషాల వరకు కట్టాలి.