సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా ప్రజా ప్రతినిధులు
హైదరాబాద్:ఆగస్టు 19 అఖండ భూమి వెబ్ న్యూస్ :
రక్షా బంధన్ సందర్భంగా.. సోమవారం జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి నివాసంలో సందడి నెలకొంది. కాంగ్రెస్‌కు చెందిన మహిళా నేతలు ముఖ్యమంత్రికి రాఖీలు కట్టారు. మంత్రి సీతక్క సీఎం రేవం త్‌కు, ఆయన మనవడికి రాఖీ కట్టారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు పర్ణికా రెడ్డి, రాగమయి సీఎంకు రాఖీ కట్టారు. బండ్రు శోభారాణి, కాల్వ సుజాత, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద కూడా ముఖ్యమంత్రి రేవంత్‌కు రాఖీలు కట్టారు.
సోదరి సీతక్కతో నా అనుబంధం.. రాఖీ పౌర్ణమి నాటి వెన్నెలంత చల్లనిది. ఈ పండుగ వేళ రాఖీ కట్టిన సీతక్కతో పాటు..
రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ జీవితంలో పండు వెన్నెల లాంటి ఆనందాలు వెల్లివిరి యాలని.. మనసారా కోరుకుంటున్నాను’ అని రేవంత్ రెడ్డి అన్నారు..
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



