వైఎస్ఆర్ కళ్యాణమస్తు ,వై ఎస్ ఆర్ షాదీ తోఫా క్రింది లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ 

వైఎస్ఆర్ కళ్యాణమస్తు ,వై ఎస్ ఆర్ షాదీ తోఫా క్రింది లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ

 

– 670 మందిమహిళలకు,రూ.4, కోట్ల47 లక్షల,70 వేలు

– జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి

భీమవరం.మే 05, అఖండ భూమి

వైఎస్ఆర్ కళ్యాణమస్తు ,వై ఎస్ ఆర్ షాదీ తోఫా క్రింది జనవరి నుండి మార్చి 2023 త్రైమాసంలో వివాహాలు చేసుకున్న జిల్లాలో 670 మంది మహిళలకి 4 కోట్ల 47 లక్షల 70 వేల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టరు పి. ప్రశాంతి తెలిపారు.

శుక్రవారం అమరావతి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కళ్యాణమస్తు, వై ఎస్ ఆర్ షాదీ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని బటన్ నొక్కి ప్రారంభించారు .ఈ కార్యక్రమంలో భీమవరం కలెక్టరు కార్యాలయం నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ షెడ్యూల్ క్యాస్ట్ కు ఒక్కొక్కరికి 1 లక్ష రూపా యల చొప్పున 146 మందికి 1 కోటి 46 లక్షల రూపాయలు , షెడ్యూల్ కులాలు వారు కులాంతర వివాహం చేసుకున్న వారికి ఒక్కొక్కరికి 1 లక్ష 20 వేల రూపాయలు చొప్పున 23 మందికి, 27 లక్షల 60 వేలు , షెడ్యూల్ ట్రైబల్ వారికి ఒక్కొక్కరికి 1లక్ష రూపాయలు చొప్పున, 3 మందికి 3 లక్షలు, షెడ్యూల్డ్ ట్రైబల్ వారు కులాంతర వివాహం చేసుకున్న వారికి 1,20,000 చొప్పున ఒక్కరికి 1 లక్ష ఇరవై వేల రూపాయలు,బి సి లకు ఒక్కొక్కరికి 50 , 000 రూపాయల చొప్పున 428 మందికి 2 కోట్ల 14లక్షల రూపాయలు. బి సి మహిళలు కులాంతర వివాహం చేసుకున్న వారికి ఒక్కొక్కరికి 75,000 వేలు చొప్పున 36 మందికి 27 లక్షలు, మైనార్టీస్ కి ఒక్కొక్కరికి 1లక్ష రూపాయలు చొప్పున 6 మందికి 6 లక్ష రూపాయలు , వికలాంగులకు ఒక్కొక్కరికి 1 లక్ష 50 వేలు చొప్పున ఒక్కరికి 1,50,000 చొప్పున 11 మందికి 16 లక్షల 50 వేలు, ఓసీలలో భవన నిర్మాణ కార్మికుల కార్డు కలిగిన వారికి ఒక్కొక్కరికి 40,000 చొప్పున 16 మందికి 6 లక్షల 40 వేల రూపాయలు చొప్పున మొత్తం జిల్లాలో ఈరోజు 670 మందికి 4 కోట్ల 47 లక్షల 70 వేల రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. ఈ కార్యక్రమం రెండవ విడతగా మంజూరు చేయడం జరిగిందని, ప్రతి మూడు నెలలకు ఒకసారి వైఎస్సార్ కల్యాణమస్తు , షాదీ తోపా అందించడం జరుగుతుందని కలెక్టరు తెలిపారు. వివాహాలు చేసుకున్న మహిళలు ఎవరైనా ఉన్నట్లయితే సంబంధిత గ్రామ , వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకొని వైయస్సార్ కళ్యాణ మస్తు , వైయస్సార్ షాది తోఫా పొందాలని జిల్లా కలెక్టరు సూచించారు.పెళ్ళయిన జంటలకు 4 కోట్ల 47 లక్షల 70 వేల రూపాయల చెక్కును జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి చేతుల మీదుగా అందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి కె. కృష్ణ వేణి, డి ఆర్ డి ఏ పి డి యం ఎస్ ఎస్ .వేణుగోపాల్ , జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిని బి. శోభారాణి , జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిని డి. పుష్ప రాణి , జిల్లా ప్రాజెక్టు మేనేజరు కె.శ్రీనివాస్, వధూవరులు ,సచివాలయం సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు .

Akhand Bhoomi News

error: Content is protected !!