ఆంధ్ర కర్ణాటక బార్డర్ సరిహద్దు చెక్ పోస్ట్ ల తనిఖీలు…

ఆంధ్ర – కర్ణాటక బార్డర్ జిల్లా సరిహద్దులో ఉన్న క్షేత్రగుడి చెక్ పోస్టును ఆకస్మిక తనిఖీ చేసిన … కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ గారు

చెక్ పోస్టులలో అప్రమత్తంగా ఉండాలి.

అక్రమ రవాణా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి.

కర్ణాటక రాష్ట్రంలో మే 10 న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం కర్నూలు జిల్లా సరిహద్దు ఆలూరు సర్కిల్ , హాలహార్వి పోలీసుస్టేషన్ పరిధిలోని క్షేత్రగుడి, చింతకుంట చెక్ పోస్టులను జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్ గారు ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలించారు. చెక్ పోస్టులలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులకు, సిబ్బందికి జిల్లా ఎస్పీ గారు పలు సూచనలు, ఆదేశాలు తెలియజేశారు. చెక్ పోస్టులలో ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో డబ్బు , మద్యం , తదితర వస్తువులు అక్రమ రవాణా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదోని డిఎస్పీ వినోద్ కుమార్ , సిఐలు, ఎస్సైలు ఉన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!