వెల్దుర్తిలో వైభవంగా ఎల్లమ్మ రథోత్సవం….. 

వెల్దుర్తిలో వైభవంగా ఎల్లమ్మ రథోత్సవం…..

 

వెల్దుర్తి మే 5 (అఖండ భూమి) : స్థానిక వెల్దుర్తి పట్టణానికి ఉత్తరం దిక్కున వెలసిన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయము నందు శుక్రవారం ఎల్లమ్మ తిరుణాల మహోత్సవం ఎంతో వైభవంగా రథోత్సవం నిర్వహించారు. ఈ రథోత్సవం బొమ్మన కుటుంబం ఆధ్వర్యంలో ఉదయము నుండి అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. బొమ్మన కుటుంబం ఇళ్ల నుండి ముందు పూజగా బోనాలు సమర్పించారు. అనంతరం గ్రామంలోని మహిళ భక్తులు వారి ఇళ్ల నుండి  బోనాలతో రేణుక ఎల్లమ్మ దేవాలయానికి వెళ్లి బోనాలు సమర్పించి  మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం అర్చకులు కిట్టయ్య స్వామి ఆధ్వర్యంలో బొమ్మన కుటుంబీకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవమూర్తులను పల్లకిపై కూర్చోబెట్టి దేవాలయం చుట్టూ ప్రదక్షణలు చేసిన అనంతరం రథం పైకి ఎక్కించి బలిదానం మంట వేసిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి రతాన్ని భక్తులతో కలసి దేవాలయం చుట్టూ లాగారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెల్దుర్తి ఎస్ఐ పి.చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు ఏ ఎస్ఐ బాలకృష్ణతోపాటు పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొమ్మన దశతరామిరెడ్డి, బొమ్మన శివ శంకర్ రెడ్డి, బ్రహ్మగుండ ఆలయ చైర్మన్ బొమ్మన పెద్దిరెడ్డి, బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి, బొమ్మన రాజశేఖర్ రెడ్డి, ,బొమ్మన రఘు రెడ్డి, ఆయకట్టుదారులు, శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ అర్చకులు గోట్ల వంశస్థులు, మరియు గ్రామ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!