నకిలీ విలేకరులతో తస్మాత్ జాగ్రత్త

 

 

నకిలీ విలేకరులతో తస్మాత్ జాగ్రత్త

యూట్యూబ్ లో పేర్లు నమోదు చేసుకోవడం విలేకరులమంటూ అధికారులు మరియు నాయకుల వద్ద హల్చల్ చేయడం వీరు నిత్యం చేసే పని.కనీసం 7, 8 ,9, 10 కూడా ఉత్తీర్ణత కాని వాళ్ళు విలేకరులమంటూ వెల్దుర్తిలో కొందరు హల్చల్ చేస్తున్నారు. వీరు అధికారుల వద్ద కూర్చుని పైరవీలు కొనసాగిస్తున్నారు.

వీరు కొందరి అధికారులను టార్గెట్ చేస్తూ బ్లాక్మెయిలింగ్ లఘు పాల్పడుతున్నారు. కనీస విద్యార్హతలు లేని వీరు, నకిలీ విలేకరులు బ్లాక్ మెయిలింగ్ లకు పాల్పడడం గమనించదగ్గ విషయం. పోలీస్ స్టేషన్, తాసిల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, వెలుగు కార్యాలయం, జాతీయ ఉపాధి గ్రామీణ పథకం కార్యాలయం, హౌసింగ్ శాఖ, వ్యవసాయ శాఖ తదితర కార్యాలయాలలోనికి వెళ్లి విలేకరులమంటూ కూర్చోవడం. అధికారులను బెదిరించడం వీరికి పరిపాలిగా మారింది. వీరికి కొందరు పోలీసులు సహకరించడం గమనించదగ్గ విషయం.

సభ్య సమాజానికి వీరు ఇస్తున్న మెసేజ్ ఏమిటి అని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నకిలీ విలేకరుల అవతారం ఎత్తి నాయకుల వద్ద హల్చల్ చేయడం చూస్తే వీరు కనీసం డిగ్రీ అన్నా చదివి ఉంటారని ప్రజలు భావిస్తున్నారు.

అధికారులు, నాయకులు నకిలీ విలేకరులతో జర జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే నకిలీ విలేకరుల ఉచ్చులో పడే మోసపోవాల్సి వస్తుంది.

డిగ్రీలు చదివిన అధికారులను ఏడో తరగతి పాస్ గాని నకిలీ విలేకరులు బ్లాక్ మెలింగ్ లకు పాల్పడడం గమనించదగ్గ విషయం. సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేస్తున్న నకిలీ గాళ్లు ఒక సెల్ ఫోన్ ,ఒక జిమెయిల్ ఉన్న ఎవరైనా యూట్యూబ్ లో ఛానల్ నమోదు చేసుకోవచ్చు అంతమాత్రాన వాళ్లు విలేకరులుగా కొనసాగలేరు ఎంత మాత్రం వాళ్ళు యూట్యూబర్లు గా మాత్రమే కొనసాగుతారుయూట్యూబర్ అధికారుల, నాయకుల కార్యాలయాల వద్దకు వెళ్ళే ఇంటర్వ్యూలు చేసే అనుమతులు వారికి లేవు.కానీ వెల్దుర్తి మండలం లో నకిలీ విలేకరులు తమకు అన్ని అనుమతులు ఉన్నాయంటూ బుకాయిస్తూ, అధికారులు మరియు నాయకుల వద్ద చలామణి అవుతున్నారు.యూట్యూబర్లకు లోగోలు పట్టుకొని అధికారుల వద్దకు తిరిగే అనుమతులు కూడా లేవు.

కానీ వెల్దుర్తి మండలం లో నకిలీ గాండ్లు లోగోలు పట్టుకుని అధికారుల కార్యాలయాలు నాయకుల కార్యాలయాలు చుట్టూ చెక్కర్లు కొడుతున్నారు.కొన్ని ప్రైవేటు యాప్ లతో వార్తలు సృష్టిస్తూ తాము విలేకరులమంటూ హల్చల్ చేయడం విశేషం.

ముఖ్యంగా ఎవరైనా సరే ప్రైవేట్ యాప్ లతో నకిలీ విలేకర్లగా యదేచ్ఛగా కొనసాగవచ్చు. ఇదే తంతును వెల్దుర్తి మండల నకిలీ విలేకరులు కొనసాగిస్తున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!