మెగా రక్తదాన వైద్య శిబిరం ఏర్పాటు
గొలుగొండ అనకాపల్లి జిల్లా
సెప్టెంబర్ 2 (అఖండ భూమి)
అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం పాత కృష్ణా దేవి పేట గ్రామంలో ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పాత కృష్ణా దేవి పేట ఉప సర్పంచ్ దుంపలపూడి సహదేవుడు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం వలన మరొక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతామని తెలిపారు ఈ కార్యక్రమానికి జిల్లా ఉపాధ్యక్షులు ఊడి చక్రవర్తి సహాయ కార్యదర్శులు హరినాథ్ అల్లాడ సురేష్ రావడం వలన విశేష స్పందన లభించింది సిహెచ్ నాగ పురం గ్రామం నుండి సుమారుగా తొమ్మిదిమంది అలాగే చుట్టుపక్కల గ్రామాల నుండి 31 మంది రక్తదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు ఊడి చక్రవర్తి మాట్లాడుతూ జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుండి ఈ గ్రామంలో జన సైనికుల సైనికులు అందరూ కలిసి చాలా మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ గ్రామంలో జనసేన సైనికులు ఎక్కువగా ఉన్నందున పక్క గ్రామాలను కలుపుకొని పార్టీని బలోపేతం చేయాలని కోరారు ఈ గ్రామం నుండి సీలింగ్ భూముల గురించి విజయవాడ జనవాణి కార్యక్రమంలో పంచకర్ల రమేష్ బాబుకు తెలియజేయడం జరిగిందని మరొక నాలుగు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి పాతాళ శివ. ఎర్ర ప్రసాదు. ఈర్ని చిన్ని.మేక సత్యనారాయణ లంక సత్యనారాయణ సేనాపతి శంకర్ పోకనాటి నానిబాబు. పందిరి రమణ. గొంతిన వరహాల బాబు. గుడివాడ శివాజీ. అనిశెట్టి గోపి. బొబ్బలి వర్మ.జన సైనికులు. కూటమి సభ్యులు.అధిక సంఖ్యలో పాల్గొన్నారు
You may also like
-
*ప్రభుత్వ విఫ్ ఆదేశాలతో* *దిగివచ్చిన ఫార్మా కంపెనీలు*
-
అండేం కొండల్ రెడ్డి నివాళులర్పించిన. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వ విప్ బీర్లఐలయ్య
-
ఎస్సీ వర్గీకరణ ఏక సభ్య కమిషన్ ను తక్షణమే రద్దు చేయాలి – డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్
-
చిరు వ్యాపారుల దుకాణాల తొలగింపులో నా ప్రమేయం లేదు..
-
మంత్రి జూ పల్లి కార్యక్రమంలో అపశృతి..