అల్లిపూడి లో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
కోటనందూరు మండలం అల్లిపూడి లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణెదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ మండల జనసేన పార్టీ అధ్యక్షులు పెదపాత్రుని శ్రీనివాస్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి సేవలను కొనియాడారు. ఆయన జీవితం ప్రజల కోసమేనని, ప్రజల సేవకై అనునిత్యం పరితపిస్తూ ప్రజాసేవలో పయనిస్తున్నారని శ్రీనివాస్ అన్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అందరికీ మేలు జరుగుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పలుచోట్ల కేక్ లను కట్ చేశారు. కార్యక్రమంలో నెమ్మది సత్యనారాయణ, నేతల రాజు , జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



