రౌతులపూడి లో మాల మహానాడు జిల్లా కోఆర్డినేటర్ చిటుమూరి గోవింద్ ఎస్సీ వర్గీకరణ పై విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని 341 ఆర్టికల్ కు వ్యతిరేకంగా ఉందని ఆయన తెలిపారు. అంతేకాకుండా కులాల మధ్య ఐక్యతను పెంపొందించేలా ఉండాలని రాజ్యాంగం చెబుతుందని కానీ వర్గీకరణ పేరుతో కులాల మధ్య ఐక్యతను దెబ్బతీసి వారి మధ్య చిచ్చు రాజేసి ఘర్షణ వాతావరణం తీసుకొస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాలుకు ఎస్సీ కులాలపై నిజంగానే ప్రేమ ఉంటే ఎస్సీల రిజర్వేషన్ కోటాను ఇప్పుడున్న దానికంటే 9 శాతం పెంచాలని తద్వారా ఎస్సీ లకు న్యాయం చేకూరుతుందని ఆయన సూచించారు. రిజర్వేషన్ లను సక్రమంగా అమలు చేయడం లేదని, అందువలన ఎస్సీల స్థితిగతులు మారలేదని వర్గీకరణ కంటే ముందు గడచిన 70 ఏళ్లుగా రిజర్వేషన్ అమలు తీరుపై సంపూర్ణ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. సుప్రీం కోర్ట్ తీర్పు ఎస్సీ కులాల మధ్య ఐక్యతను దెబ్బతీసే విధంగా ఉండకూడదని దీనిపై ఉన్నత న్యాయస్థానం పునః పరిశీలించాలని ఆయన కోరారు.
ANDHRA BREAKING NEWS