అఖండ భూమి నాతవరం
రాష్ట్ర సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు 68వ జన్మదిన సందర్భంగా నాతవరం మండలం వైబి పట్నం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కూండ్రపు అప్పలనాయుడు సెప్టెంబర్ 4 బుధవారం తమ గ్రామస్తులు నాయకులు తో కలసి వైబి పట్నం నుండి గన్నవరం గ్రామ వరకు శ్రమదానం చేసి గుంతలు పూడ్చి రోడ్డు మరమ్మత్తులు చేపట్టి రోడ్డుకి ఇరువైపులా గల తుప్పలను నాయకులతో కలిసి శ్రమదానం చేసి తొలగించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ గన్నవరం నుండి వైవి పట్నం వరకు బీటీ తారు రోడ్డు మంజూరు కాబడినదని వర్షాలు అనంతరం రోడ్డు పనులు మొదలు పెడతారని ఆయన అన్నారు అలాగే నాతవరం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించారు.అనంతరం గడచిన ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అయ్యన్న యువశక్తి సభ్యులు ఒకటవ వార్డులో త్రాగునీరు సౌకర్యం కొరకు బోరు కొట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు పారుపల్లి కొండబాబు, నేతలు విజయ్ కుమార్, చిటికలు సన్యాసి దేవుడు, మాజీ ఎంపీటీసీలు అప్పిరెడ్డి మాణిక్యం, బంగారు సూరిబాబు, ఎర్ర కాశి శెట్టి లోవ, శెట్టి నానాజీ, శెట్టి గోపి, అంకం రెడ్డి శివ, పిన్ని రెడ్డి వాసు సుర్ల నాగబాబు, శెట్టి నాయుడు, పిటం శెట్టి బుజ్జి, గొర్లి లావరాజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్డీఏ కూటమి సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్