కొయ్యూరులో టిటిడి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు
టీటీడీ దేవస్థానం ప్రచారకర్త” డి పద్మరాజు”
కొయ్యూరు అల్లూరి జిల్లా (అఖండ భూమి)తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సాంస్కృతిక భజన కార్యక్రమాలలో భాగంగా అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలో వారం రోజులపాటు భజన ప్రవచన కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచారకర్త డి పద్మరాజు, టిటిడి పురాణ పండితులు చల్లా సత్యనారాయణ ఆధ్వర్యంలో వారం రోజులపాటు భగవద్గీత రామాయణ ప్రవచనాలతో పాటు స్థానిక భక్తులతో భజన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణే ద్యేయంగా సనాతన ధర్మాలకు ఊపిరి పోసేందుకు, గిరిజనులలో భక్తి భావాన్ని పెంపొందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంస్కృతి సాంప్రదాయాలు సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎం మాకవరం రాజేంద్రపాలెం కాకరపాడు భజన బృందాల సభ్యులు పాల్గొన్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..