షబ్బీర్ అలీ ఫౌండేషన్ కు తలసేమియా సికిల్ సెల్ పురస్కారం అందజేత

 

 

షబ్బీర్ అలీ ఫౌండేషన్ కు తలసేమియా సికిల్ సెల్ పురస్కారం అందజేత

కామారెడ్డి జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 8 (అఖండ భూమి)

తలసేమియా చిన్నారుల కోసం షబ్బీర్ అలీ జన్మదినం సందర్భంగా 2023,2024 సంవత్సరాలలో మెగా రక్తదాన శిబిరాలను తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం నిర్వహించిన 609 యూనిట్ల రక్తాన్ని అందజేసినందుకు గాను తలసేమియా సికిల్ సెల్ సొసైటీ హైదరాబాద్ వారు అందజేసిన పురస్కారాన్ని షబ్బీర్ అలీ ఫౌండేషన్ నిర్వాహకులు, యువజన కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఇలియాస్ కు ఆదివారం అందజేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారులకు ప్రతి 15 రోజులకు యూనిట్ రక్తం అవసరం ఉంటుందని అలాంటి చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం షబ్బీర్ అలీ జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని షబ్బీర్ అలీ ఫౌండేషన్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.ప్రతి సంవత్సరం ఇలాంటి మెగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ ప్రధాన కార్యదర్శి గంప ప్రసాద్,ఉపాధ్యక్షులు జమీల్, సలహాదారులు వెంకటరమణ లు పాల్గొన్నారు..

Akhand Bhoomi News

error: Content is protected !!