మహిళ అన్ని రంగాల్లో ముందు ఉండాలని

యర్రగొండపాలెం అఖండ భూమి.

సోమవారం 23/09/2024 వ తేదీ నాడు సార్డ్స్ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో యర్రగొండపాలెం సార్డ్స్ కార్యాలయం నందు 40 గ్రామాలలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ లో ఎన్నుకోబడిన మహిళ ప్రతినిధులు కు శిక్షణా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ముందు ఉండాలని, ఇంట్లో మరియు గ్రామంలో చదువు యెుక్క ప్రాముఖ్యత గురించి తెలియజేసే విధంగా మీరు ఉండాలని, అలాగే సొంతం గా వ్యాపారం, నలుగురికీ సలహాలు సూచనలు ఇచ్చే విధంగా, మరియు గ్రామంలో మహిళల పై జరిగే అనేకరకాల సమస్యలను పరిష్కరించుకునే విధంగా మరియు బాల్యవివాహాలు జరగకుండా మన గ్రామాన్ని బాల్య వివాహ రహిత గ్రామంగా తేర్చిదిద్దుకునే విషయం లో మహిళ యొక్క ప్రాముఖ్యం ప్రధానం అని యర్రగొండపాలెం ఎంఈఓ ఆంజనేయులు తెలియజేశారు. అలాగే మహిళలు ముందంచ లో రాణించాలంటే క్రమ శిక్షణ చాలా అవసరం అని అది పిల్లలకు మనం అలవాటు చేయాలని, ఇల్లాలి చదువు – ఇంటికి దీపం, అనగా ప్రతి ఆడబిడ్డ చదువుకోవాలని, అలా చదువుకోవడం వలన జీవితం లో ఏదైనా సాధించగల శక్తి ఉంటుందని పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సార్స్ బాల ప్రకాశం ప్రొజెక్టర్ స్టాఫ్ పి య మ్ జి, మహాలక్ష్మి య మై &ఇ కే.శశీ మోహన్ , యసై ఓ బీ.రామ లక్ష్మి మరియు ఏ యస్ ఓ యమ్ . యేబేబు పాల్గొని ఈ ప్రోగ్రాం ని విజయవంతం చేయడం జరిగింది

Akhand Bhoomi News

error: Content is protected !!