దారిలేని కాలనీకి రోడ్డు సౌకర్యం మౌలిక వసతులు కల్పించాలి…

 

కలెక్టరేట్ వద్ద గ్రామస్తుల ధర్నా.

మద్దతుగా నిలిచిన బి ఎస్ పి..

అమలాపురం (అఖండభూమి)

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని, జనపల్లి న్యూ కాలనీలోని దారిలేని కాలనీ రోడ్డు లేని కాలనీ కలెక్టర్ కార్యాలయానికి కూత వేటు దూరములో ఉన్న ఈ దారిలేని కాలనీ వాసులు గత 18 సంవ త్సరాలుగా రోడ్డు, త్రాగునీరు మౌలిక వసతులు కోసం ఏళ్ల తరబడి ప్రభుత్వ అధికారుల చుట్టూ ఆఫీసులు చుట్టూ గెలిచిన ప్రతి ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూఉన్నారు.
దారిలేని మా గ్రామానికి దారి వేస్తారేమో అని ఆత్రుతతో మౌలిక సదుపాయాల కోసం ఎదురుచూస్తూ.సోమవారం గ్రామస్తులందరూ కలెక్టర్ ఆఫీస్ ముందు వారి యొక్క నిరసన ప్రదర్శన నిర్వహించారు వారు పడుతున్న కష్టాలు ఆవేదనతో వెలిబుచ్చారు వారికి బహుజన్ సమాజ్ పార్టీ అమలాపురం నియోజకవర్గం ఇంచార్జ్
పొలమూరి మోహన్ బాబు, పూర్తి మద్దతు తెలియజేస్తూ వారి సమస్యలపై ప్రభుత్వ అధికారులపై, ప్రజల ప్రతినిధు ల అభివృద్ధి అంటే అమలాపు రం అభివృద్ధి అంటే ఆనంద రావు అన్నటువంటి మన ఎమ్మెల్యే ఈ సమస్యని తక్షణం పరిగణలోకి తీసుకుని రోడ్డు లేని జనపల్లి న్యూ కాలనీవాసు లకు రోడ్డు నిర్మించాలని త్రాగు నీరు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు, లేనిపక్షంలో కలెక్టర్ ఆఫీస్ ముందే త్వరలో వన్ టవర్ కార్యక్రమం చేపడతా మని డిమాండ్ చేసారు.

Akhand Bhoomi News

error: Content is protected !!