వెల్దుర్తి సెప్టెంబర్ 23 (అఖండ భూమి) : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తోనే వందరోజులలో అభివృద్ధి సంక్షేమం సాధ్యపడిందని పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. సోమవారం మండల పరిధిలోని బోగోలు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం బోగోలు సర్పంచ్ అమర్నాథ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసిందని తెలిపారు. విజయవాడలో జగన్ అనుచరులు బోట్ల ద్వారా ఇసుకను వేసి నీరు ఎక్కువగా వచ్చేందుకు ప్రయత్నం చేశారని తెలిపారు. వేల కోట్లు అప్పుచేసి రాష్ట్రాన్ని అప్పుల మయంగా మార్చిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు. అప్పుల మూబీలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని సరైన గాడిలో పెట్టేందుకే ప్రజలు చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకున్నారని అన్నారు. పెన్షన్ పెంపు విధానం చంద్రబాబు నాయుడు ఒకేసారి పెంచి ప్రజల గుండెలలో నిలిచిపోయాడని తెలిపారు. వికలాంగులకు రూ. 6వేలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా సంతకం చేసిన తర్వాత మెగా డీఎస్సీ పై తొలి సంతకం, రైతులకు సంబంధించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారని అన్నారు. ఆకలితో ఉన్న నిరుపేదలకు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం అర్షించదగ్గ విషయమని తెలిపారు. అనంతరం గర్భవతులకు శాలువాలు కప్పి మాతృమూర్తులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, ఫణి రాజ్ , నాగేశ్వరరావు యాదవ్, పుల్లగుమ్మి నాగేశ్వర్ రెడ్డి, సుధాకర్ గౌడ్, రామకృష్ణ ఆచారి, తాసిల్దార్ చంద్రశేఖర్ వర్మ, ఎంపీడీవో శివ మల్లేశ్వరప్ప, ఎంఈఓ ఇందిరా, అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి

