అభివృద్దే టిడిపి కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

అభివృద్దే టిడిపి కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
క్రిష్ణగిరి ( అఖండ భూమి): అభివృద్ధిలో వెనకబడ్డ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించడమే టిడిపి కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పత్తికొండ ఎమ్మెల్యే కే ఈ శ్యాం బాబు అన్నారు. మండలంలోని కంబాలపాడు గ్రామంలో సోమవారం గ్రామ సర్పంచ్ మారెమ్మ అధ్యక్షతన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే శాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ రాష్ట్రాన్ని పరిపాలించే విధానం చేతకాక పోవడం తో రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందని ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే వృద్ధులకు వితంతులకు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచిందని, రైతుల కోసం ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసిందని నిరుద్యోగ యువతి యువకుల కోసం మెగాడీఎస్సీ , పేద ప్రజల ఆకలి తీర్చడం కోసం అన్న క్యాంటీన్లు తదితర ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తామన్నారు. అనంతరం అంగన్వాడి కార్యకర్తల ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలు, బాలింతల కు పౌష్టికాహారాన్ని అందించారు. అదేవిధంగా గ్రామంలోని వర్మి కంపోస్టు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విశ్వమోహన్ , కర్నూలు పార్లమెంట్ ఆర్గనైజింగ్ కార్య నిర్వాహ కార్యదర్శి ఆలంకొండ నబి సాహెబ్, లీగల్ సెల్ కార్యదర్శి ప్రసాద్, తెలుగు యువత అధ్యక్షులు రఫీ, టిడిపి మండల ప్రధాన కార్యదర్శి గురుస్వామి, మండల టిడిపి ఉపాధ్యక్షులు దామోదర్ నాయుడు పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!