జగనన్న పాలనల ప్రజలు మెచ్చిన పాలన… సుధాకర్ రెడ్డి
తుగ్గలి మే 5(అఖండ భూమి) :
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన లో రాష్ట్రంలోనే ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని సర్పంచ్ సలహాదారుడు సుధాకర్ రెడ్డి, సచివాలయ కన్వీనర్ లింగన్న లు అన్నారు. శుక్రవారం మరేళ్ల గ్రామంలో ఏర్పాటుచేసిన వైఎస్ఆర్సిపి కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ నవరత్నాల పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రభుత్వము గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించడం కూడా జరిగిందన్నారు. రాష్ట్రంలో పేద ప్రజలకు సువర్ణ పాలన కొనసాగాలంటే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మనమంతా నిలవాలన్నారు. అన్ని వర్గాల ప్రజలు రాజకీయ ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే జగన్మోహన్ రెడ్డి లక్ష్యం అన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందెందుకు అనేక పథకాలు ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న టిడిపి నేతలకు సైతం సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటరీ వ్యవస్థతో ప్రజల ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందుతున్నాయి అన్నారు. అందువల్ల రానున్న ఎన్నికలలో మరోసారి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా, శ్రీదేవమ్మ ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని వారు కార్యకర్తలకు తెలిపారు.



