ఓం నమో భగవతే రామకృష్ణాయ

ఓం నమో భగవతే రామకృష్ణాయ

 

స్వామి వివేకానంద జీవిత గాథ:-32

నరేంద్రుని ఆశ్చర్యం వర్ణనాతీతం.

శ్రీరామకృష్ణుల మాటలూ, అనుభవాలు ఉపదేశాలు ఆయన జీవితం ఆయనను నిజమైన సాధువుగా గుర్తించి నరేంద్రుడు మనస్సులో, ‘ఈ వ్యక్తి గురువుగా ఉండగలరా? నా సందేహాన్ని ఈయనను అడగవచ్చా?” అనే ప్రశ్న మెదలింది. వెంటనే శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్లి చాలా రోజులుగా తన మనస్సును వేధిస్తున్న అనేకులను అడిగినా జవాబు లభించని ఆ ప్రశ్నను అడిగాడు.

“మహాశయా, మీరు భగవంతుణ్ణి కళ్లారా చూశారా?”

ఎక్కడెక్కడో వెదకివేసారి నిష్పలమై తిరుగుముఖం పట్టిన ప్రశ్న ఎట్టకేలకు సముచితమైన చోటు చేరుకొంది. ఠక్కున జవాబు వచ్చింది.

“అవును చూశాను. ఎంతో స్పష్టంగా నిన్ను చూస్తున్నంత స్పష్టంగా, ఇంకా స్పష్టంగా” అన్నారు. శ్రీరామకృష్ణులు.

“నిన్ను చూస్తూన్నట్లుగా, నీతో మాట్లాడుతున్నట్లుగా భగవంతుణ్ణి చూడవచ్చు, ఆయనతో మాట్లాడవచ్చు. కాని ఎవరికి ఆ కోర్కె ఉంది! భార్యాపిల్లల నిమిత్తం లోకులు కడవల కొద్దీ కన్నీరు కారుస్తారు; ధనం కోసమూ, సుఖభోగాల కోసమూ: దొర్లుతూ విలపిస్తారు. భగవద్దర్శనం పొందలేదని ఎవరు విలపిస్తున్నారు? ఆయనను దర్శించాలనే పరమ వ్యాకులతతో బిగ్గరగా పిలిస్తే ఆయన తప్పకుండా సాక్షాత్కరిస్తాడు.”🙏

Akhand Bhoomi News

error: Content is protected !!