పచ్చని చెట్లపై.. మున్సిపల్ గొడ్డలి వేటు..?
-నాటేది మేమే.. అడ్డొస్తే నరికేది మేమే..?
-సుమారు 200 అవెన్యూ ప్లాంటేషన్ చెట్ల నరికి వేత..?
-ఇదేనా సుందరీకరణ..?
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి సెప్టెంబర్: 25 (అఖండ భూమి) ఆర్మూర్ మున్సిపల్ అధికారులు డివైడర్ల మధ్యన నాటిన సుమారు 200 పచ్చని చెట్లను నరికి వేయడం పట్టణంలో హాట్ టాపిక్ గా మారింది. వివరాలు సేకరిస్తే ఏ పుగా పెరిగిన చెట్లతో ప్రజలకు ఇబ్బందిగా మారిందని ఫిర్యాదులు రావడంతో చెట్లను నరికి వేయవలసి వచ్చిందని మున్సిపల్ అధికారులు వివరణ ఇస్తున్నారు..? చెట్లతో ఇబ్బందిగా మారిందని ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి..? అనే విషయంపై మున్సిపల్ అధికారులు చెప్పకపోవడం గమనార్హం..? రాత్రి వేళల్లో డివైడర్ల మధ్యలో చెట్లు ఉండడం వల్ల ఎదురుగా వస్తున్న వాహన వెలుతురు కళ్ళపై పడేది కాదు. ఇప్పుడు ఎదురుగా వస్తున్న వాహన ఎల్ ఈ డి లైట్లతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. వచ్చే దీపావళికి చెట్లకు విద్యుత్ దీపాలను అలంకరించి చక్కగా ముస్తాబు చేస్తారు. దీపావళి నాటికి 15 రోజుల్లో ఇగురుతోపాటు కొమ్మలు మొలుస్తాయని అధికారులు ఎంచక్కా వివరణ ఇస్తున్నారు. చెట్లు నాటుట నరుకుట కేనా..? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.. కొందరైతే రాజకీయ నాయకుల ఫోటోలు కనబడడం లేదనే..? చెట్లను నరికేశారని..? నరికేశాక మున్సిపల్ అధికారులు కహానీలు చెబుతున్నారని ఆరోపిస్తున్నారు..?
You may also like
-
కబ్జా చేస్తున్న చెక్కిళ్ల శ్రీనివాస్
-
రాక్స్ రాష్ట్ర కార్యదర్శిగా న్యాయవాది కొండ్రు కళ్యాణ్ నియామకం
-
ఆప్కాబ్ గిడ్డంగులను పరిశీలించిన అదికారులు సంతృప్తి వ్యక్తం చేసిన డిసీసీబి, నాబార్డు అదికారులు
-
ఆ పార్టీలను భూస్థాపితం చేయాలి: రాక్స్ అధినేత డాక్టర్ రత్నాకర్
-
రైతు సమస్యల పరిష్కార వేదికగా రీ సర్వే గ్రామసభ.