కోతులు బాబోయ్ కోతులు. పంట పోలాలు నాశనం చేస్తున్నాయి
నష్టపోతున్నాం అంటున్న గిరిజన రైతాంగం
కొయ్యూరు అల్లూరి జిల్లా
(అఖండ భూమి) సెప్టెంబర్ 23
కోతులు బాబోయ్ కోతులు మనుషుల ప్రాణాలతోటే కాకుండా పంట చేలును కూడా నాశనం చేస్తూ తీవ్రంగా రైతాంగాన్ని నష్టపరుస్తున్నాయంటూ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మండలంలో బట్ట పనుకుల పంచాయతీ పరిధిలో గల తీగల మెట్ట గ్రామములో ఉన్న పంట పొలాలపై ఇబ్బడి ముప్పడిగా కోతులు దాడులు చేస్తూ నాశనం చేస్తున్నాయన్నారు వేలాది రూపాయలు అప్పులు చేసి పంటలకు పెట్టుబడి పెట్టామని పంట చేతికి రాకముందే కోతుల రూపంలో నష్టపోవలసిన దుర్భర పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆవేదనే వ్యక్తం చేస్తున్నారు. వందల సంఖ్యలో కోతులు రావడంతో అవి ఎక్కడ తమపై దాడులు చేస్తాయో ప్రాణ భయంతో పరుగులు పెడుతున్నామని దీంతో కోతులు తమ ప్రతాపం అంతా పంట పొలాలపై చూపిస్తూ తమకు నష్టం మిగులుతున్నాయని తెలిపారు ఫారెస్ట్ అధికారులు స్పందించి కోతులను నుండి ప్రజలను కాకుండా పంట పొలాలను కూడా కాపాడాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు లేకుంటే తామంతా ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని వారు అంటున్నారు
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి కలెక్టర్…
బి సిల ఆణిముత్యం రత్నప్ప కుంభార్ సేవలు యువతకు స్ఫూర్తి
మా విద్యార్థులు ఎక్కువ మంది హిందీ నేర్చుకోవాలని మేం కోరుకుంటున్నాం: రష్యా మంత్రి…
దోమకొండ ఊరడమ్మ వీధిలో శానిటేషన్ కార్యక్రమం