*మిత్రుడు కుటుంబాన్ని ఆదుకున్న స్నేహబంధం. తుగ్గలి సెప్టెంబర్ 23 (అఖండ భూమి న్యూస్):-* తమలో చదివిన బాల్యమిత్రుడి కుటుంబం కష్టాల్లో ఉన్నదని తెలిసి అండగా నిలిచారు పూర్వ విద్యార్థులు. తుగ్గలి జిల్లా పరిషత్ హై హై స్కూల్లో చదువుకున్న పూర్వ విద్యార్థి సుధాకర్ (38) కొన్ని రోజులుగా కిడ్నీ వ్యాధి తో బారినపడి అకాల మరణం చెందాడు. విషయం తెలుసుకున్న 2003 (పదవ తరగతి) బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థులు తుగ్గలి మండలం చెన్నంపల్లి గ్రామంలో ఉంటున్న స్నేహితుడి కుటుంబాన్ని ఇంటికి వెళ్లి పరామర్శించి తమ వంతు సహాయంగా సుమారు 60 వేల రూపాయలు అందజేసి గొప్ప మనసు చాటుకున్నారు.ఈ సందర్భంగా పలువురు స్నేహితులు మాట్లాడుతూ ఈ లోకంలో స్నేహానికి మించిన బంధం మరొకటిలేదని అందరితో మమేకమై కలివిడిగా కష్టసుఖాలను పాలుపంచుకునే ఆప్త మిత్రుడు దూరమవ్వడం చాలా బాధాకరమని భౌతికంగా మా మధ్య లేకపోయినా అతని భావాలు మాపై చూపించిన ఆధారాభిమానాలు ఏనాటికి చెరగని స్మృతులుగా మా మధ్య మెదలాడుతూనే ఉంటాయని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. మిత్రుడు సుధాకర్ కుటుంబానికి ఎల్లవేళలా తమవంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.
You may also like
-
రఘునాథపురం గ్రామంలో అంగన్వాడి బిల్డింగ్ శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్లే ఆలేరు ఎమ్మెల్యే. బీర్ల.ఐలయ్య
-
రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడియ్య కు అభినందనలు తెలిపిన రాక్స్ సెక్రెటరీ కొండ్రు కళ్యాణ్
-
కబ్జా చేస్తున్న చెక్కిళ్ల శ్రీనివాస్
-
రాక్స్ రాష్ట్ర కార్యదర్శిగా న్యాయవాది కొండ్రు కళ్యాణ్ నియామకం
-
ఆప్కాబ్ గిడ్డంగులను పరిశీలించిన అదికారులు సంతృప్తి వ్యక్తం చేసిన డిసీసీబి, నాబార్డు అదికారులు