కొయ్యూరు బాయ్స్ టు లో కరాటే శిక్షణ తరగతులు

కొయ్యూరు బాయ్స్ టు లో కరాటే శిక్షణ తరగతులు

కరాటే క్లబ్ చీప్ ఇన్స్ట్రక్టర్ బాకూరు పాండురాజు
కొయ్యూరు అల్లూరి జిల్లా
(అఖండ భూమి) సెప్టెంబర్ 23

కరాటే శిక్షణ తో విద్యార్థులు ఎంతో ఆరోగ్యవంతంగా ఉల్లాసంగా ఉంటారని కొయ్యూరు గిరిజన సంక్షేమ శాఖ పాఠశాల ( 2)ప్రధానోపాధ్యాయులు డిబి మురళి అన్నారు సోమవారం కరాటే అసోసియేషన్ స్టూడెంట్స్ కోఫుకాన్ కరాటే క్లబ్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ బాకూరు పాండురాజు పర్యవేక్షణలో కరాటే శిక్షణ తరగతులు ప్రారంభించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు డిబి మురళి మాట్లాడుతూ విద్యార్థులు కరాటే లో శిక్షణ తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతంగా ఉండటంతో పాటు క్రమశిక్షణతో ఉంటూ చెడు వ్యసనాలు వైపు వెళ్లకుండా చదువు లో రాణించగలరని ఆయన ఈ సందర్భంగా తెలిపారు అలాగేకరాటి చీఫ్ ఇన్స్ట్రక్టర్ ఎగ్జామినర్ బాగూరు పాండురాజు మాట్లాడుతూ కరాటే నేర్చుకోవడం వల్ల ప్రతి ఒక్కరు దృఢంగా ఉంటూ చదువులో కూడా విద్యార్థులు ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని అన్నారు అనంతరం రెజ్లింగ్ అకాడమీని సందర్శించి అకాడమీ కోచ్ పీడీ అంబటి నూకరాజును ను సన్మానించారు అల్లూరి జిల్లాలో గిరిజన ప్రాంతంలో ఎంతో మంది విద్యార్థులకు రాష్ట్ర జాతియ స్థాయిలో పథకాలు తెచ్చేలా శిక్షణ ఇస్తున్న పీడీ నూకరాజుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పొందుతున్న విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో కూడా పథకాలు సాధించాలని సూచించారు. శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ప్రభుత్వాలు కూడా అన్ని విధాలుగా ప్రోత్సహించాలని ఈ సందర్భంగా కరాటే క్లబ్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ ఎగ్జామినర్ బాకూరు పాండురాజు తెలిపారు

Akhand Bhoomi News

error: Content is protected !!