స్వచ్ఛంద సేవ సంస్థ పేరుతో స్వాహా..

 

స్వచ్ఛంద సేవ సంస్థ పేరుతో స్వాహా..

-ఆంధ్ర నుండి వచ్చిన 14 మంది బ్యాచ్..

-తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థ పేరుతో లక్షల్లో వసూల్..

-14 రోజులుగా బాలాజీ లాడ్జిలో మకాం..

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి అక్టోబర్: 04 (అఖండ భూమి) ఆర్మూర్ తపస్వి స్వచ్ఛంద సేవ సంస్థ పేరుతో ఆంధ్ర విజయనగరం నుండి 14 మంది విజన్ ఇండియా ఫౌండేషన్ పేరుతో ఐడి కార్డులు ముద్రించుకొని ఎవ్వరికి అనుమానం రాకుండా సూటు బూటు వేసుకొని అనాధ ఆశ్రమం అంటూ కొన్ని లక్షల్లో డబ్బులు వసూలు చేసిన బ్యాచ్ శుక్రవారం బాలాజీ లాడ్జిలో పట్టుబడిన సంఘటన సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే గత 14 రోజుల క్రితం ఆంధ్ర నుండి 14 మంది సభ్యుల బ్యాచ్ విజన్ ఇండియా ఫౌండేషన్ పేరుతో ఐడెంటి కార్డులు సృష్టించుకుని బాలాజీ లాడ్జిలో మకాం వేసి ఆర్మూర్ లోని తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థ పేరుతో డివిజన్లోని గ్రామాల్లో అనాధ చిన్న పిల్లలు. అనాధ వృద్ధుల ఫోటోలను చూపిస్తూ నగదు. ఫోన్ పే రూపంలో లక్షలు వసూలు చేశారు. నవీపేట్ మండలంలోని

నాలేశ్వర్ గ్రామంలో డబ్బులు వసూలు చేస్తుండగా గ్రామానికి చెందిన కొందరు యువకులు అనుమానపడ్డారు. డబ్బులు వసూలు చేసిన తర్వాత ముఠా సభ్యులు బాలాజీ లాడ్జ్ కు వచ్చారు. నాలేశ్వర్ గ్రామ యువకులు బృహత్తర ప్లాన్ వేసి పాపది పుట్టినరోజు ఉందని బియ్యం బస్తా ఇవ్వాలని ఫోనులో ముఠా సభ్యులను అడుగగా ఆర్మూర్ బాలాజీ లాడ్జ్ కు రావాలని ముఠా సభ్యులు చెప్పారు. ముఠా సభ్యులు తపస్వి పేరుతో వసూలు చేస్తున్నడంతో తపస్వి డైరెక్టర్ శ్రీనివాస్కు సమాచారం ఇచ్చారు. తపస్వి పేరుతో ఎలాంటి చందా డబ్బులు వసూలు చేయడం లేదని చెప్పడంతో పదిమంది ముఠా సభ్యులను బాలాజీ లాడ్జిలో పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఇంకా నలుగురు ముఠా సభ్యులు విషయం తెలిసి పారిపోయినట్లు తెలిసింది. ముఠా సభ్యులను చాకచక్యంగా వలవేసి పట్టుకున్నందుకు ఎస్సై గంగాధర్ ప్రభాస్ చౌల్. నాలేశ్వర్ తాజా మాజీ సర్పంచ్ సరీన్ లను అభినందించారు. తపస్వి పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్వచ్ఛంద సేవ సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తపస్వి స్వచ్ఛంద సేవ సంస్థ పేరుతో ఎప్పుడు డబ్బులు వసూలు చేయరని ప్రజలు గమనించాలని వారు కోరారు. సమస్త పేరు చెప్పి వసూళ్ళు చేస్తున్నడంతో చందా రూపంలో వచ్చే డబ్బులు రాక గత 6 నెలల నుండి అద్దె డబ్బులు 2,40,000 చెల్లించవలసి ఉందని డైరెక్టర్ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని 21వ. వార్డు కౌన్సిలర్ లిక్కీ శంకర్ డిమాండ్ చేశారు.

Akhand Bhoomi News

error: Content is protected !!