కబ్జా అవుతున్న భూమిని కాపాడండి ఎస్సి మోర్చా జిల్లా అధ్యక్షులు :కోడి రమేష్
బెల్లంపల్లి అక్టోబర్ 08(అఖండ భూమి):బెల్లంపల్లి నియోజకవర్గం ఆకనపల్లి శివారు సర్వేనెంబర్ 3 పైన అసైన్డ్ భూమి లో కాంగ్రెస్ పార్టీ వాళ్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని.ఈ సందర్బంగా ఎస్సి మోర్చా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కోడి రమేష్ మాట్లాడుతూ..హైడ్రా వాళ్లకు వర్తించదా వడ్డించేవాడు మనవాడు అయితే ఏమైనా చేసుకోవచ్చునా.ఇల్లులు కడుతున్నారు సుమారుగా 40 లక్షల రూపాయల విలువ చేసే భూమిని అప్పనంగా కొట్టేద్దామని చూస్తున్నారు. అట్టి భూమిపై రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్లు తక్షణమే స్పందించకపోతే భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఆ భూమి దళితులకు చెందే అంతవరకు దశలవారిగ ఉద్యమాలు చేపడతామని కలెక్టర్ కు ఆర్డిఓ కు చెబుతున్నాం.దయచేసి ఆ భూమిని తక్షణమే స్వాధీనం పరుచుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా డిమాండ్ చేస్తుందిఅన్నారు…