కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలి.
యర్రగొండపాలెం అఖండ భూమి వెబ్ న్యూస్ :
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకుల డిమాండ్య ర్రగొండపాలెం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సుదీర్ఘకాలంగా గత 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చలర్లను వారి సర్వీస్ ను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.రాష్ట్ర అసోసియేషన్ పిలుపుమేరకు అందరూ క్లాసులకు పసుపు రిబ్బన్లు ధరించి విధులకు హాజరై, అనంతరం గత ప్రభుత్వం జీవో నెంబర్ 114 ప్రకారం కాంట్రాక్ట్ లెక్చర్స్ అందర్నీ క్రమబద్ధీకరిస్తామని చెప్పి కాలయాపన చేసిందని తెలియజేశారు.. ప్రస్తుత ప్రభుత్వం తమను రెగ్యులర్ చేసి రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు.దీనిలో భాగంగా ఎర్రగొండపాలెం పట్టణంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు కాలేజీ వద్ద నిరసన చేపట్టారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, కే ప్రతాప్ కుమార్,జ్యోతి ప్రియాంక,శ్రీనివాసరెడ్డి,రాజశేఖర్ రెడ్డి,మాధవి,అధ్యాపకులు పాల్గొన్నారు.
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి కలెక్టర్…
బి సిల ఆణిముత్యం రత్నప్ప కుంభార్ సేవలు యువతకు స్ఫూర్తి
మా విద్యార్థులు ఎక్కువ మంది హిందీ నేర్చుకోవాలని మేం కోరుకుంటున్నాం: రష్యా మంత్రి…
దోమకొండ ఊరడమ్మ వీధిలో శానిటేషన్ కార్యక్రమం