నారా లోకేష్ పాదయాత్రకు కు బ్రహ్మరథం
ఘన స్వాగతం పలికిన కర్నూలు, నంద్యాల జిల్లాల టిడిపి నాయకులు
ప్యాపిలి, ఏప్రిల్ 13,(అఖండ భూమి న్యూస్ ) :
టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర పాదయాత్రలో భాగంగా గురువారం అనంతపురం జిల్లా నుండి నంద్యాల జిల్లా లోని డోన్ నియోజకవర్గం ప్యాపిలి మండల పరిధిలోని సరిహద్దులోని డి. రంగాపురం గ్రామం నుండి నంద్యాల జిల్లాలో పాదయాత్ర ప్రారంభమైనది. ఈ సందర్భంగా జిల్లా సరిహద్దులు ఉమ్మడి జిల్లాల టిడిపి నాయకులు మాజీ ఎమ్మెల్యే కొట్ల సుజాతమ్మ, కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి, కేఈ ప్రభాకర్, బీసీ జనార్దన్ రెడ్డి, భూమా అఖిలప్రియ, ధర్మవరం సుబ్బారెడ్డి, వై నాగేశ్వరరావు యాదవ్ తదితర టిడిపి ముఖ్య నాయకులు నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎస్సీలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జక్కసాని కుంట్ల నుండి పి ఆర్ పల్లె మీదుగా గుడిపాడు చేరుకొన్నారు నారా లోకేష్ పాదయాత్రకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
తిరుమల లడ్డు అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు


