అమెరికా లో డేనియల్ రాజు ఫౌండేషన్ సేవలు

అమెరికా లో డేనియల్ రాజు ఫౌండేషన్ సేవలు

అమెరికా, ఏప్రిల్ 07, (అఖండ భూమి న్యూస్):

కర్నూలు లో అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సంవత్సరాలుగా తన తండ్రి అయిన కీ శే డేనియల్ రాజు  పేరు పైన కార్మిక శాఖ లో ఉద్యోగం చేసే సుమన్ అనే యువకుడు చేస్తున్న రక్తదాన మరియు సేవా కార్యక్రమాలు  వలన ఎన్నో వేల మంది కి ప్రాణదానం చేశారు…ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండ తన ఫౌండేషన్ యొక్క సేవలను విదేశాలకు కూడా విస్తరింప చేయాలి అని ఆలోచనతో అమెరికాలో ఉండే తన స్నేహితురాలు సుష్మా సహకారం తో 2 సంవత్సరాల క్రితం డేనియల్ రాజు ఫౌండేషన్ తరుపున మొదటి రక్తధానం చేయడం జరిగింది..
ఇప్పుడు మరొక సారి అమెరికాలో ని అట్లాంటా లో సౌత్ లైఫ్ కమ్యూనిటీ బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం లో డేనియల్ రాజు ఫౌండేషన్ తరుపున వారి వాలంటీర్ సుష్మ సహకారం తో ముగ్గురు కిషోర్,ప్రదీప్,రామకృష్ణ రక్తధానం చేయడం జరిగింది భారతీయులు అందులోనూ తెలుగు వారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తోటివారికి సహాయం చేస్తూ సేవా కార్యక్రమాల్లో ముందు ఉంటారు అని నిరూపించారు  అలాగే మరొక ఆరు మంది అనివార్య కారణాల వలన ఇప్పుడు ఇవ్వలేకపోయారు వీరు త్వరలో జరిగే రక్థధాన శిబిరంలో రక్తధానం చేస్తారు …ఈ సందర్భంగా డేనియల్ రాజు ఫౌండేషన్ ఫౌండర్ సుమన్ మాట్లాడుతూ ఇన్ని సంవత్సరులుగా మా తండ్రి గారి పేరుతో చేస్తున్న సేవలను ఇప్పుడు దేశాలు దాటి విదేశాలలో కుడా సేవలు ప్రారంభించింది అని తెలియచేయడానికి ఎంతో సంతోసిస్తున్నాం అమెరికాలో సేవలు ప్రారంవించడానికి కారణం అయిన నా స్నేహితురాలు అలాగే మన వాలంటీర్ అయిన సుష్మ కి తనకి తోడు నిలిచిన తన భర్త కిశోర్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను ఇక పైన అమెరికాలో మరియు ఇతర  దేశాలలో కుడా రక్తధానం పైన సేవలు కొనసాగిస్తాం అని తెలిపారు…తెలుగు వారు భారతీయులు ప్రపంచం లో ఎక్కడ ఉన్నా సేవలో ముందు ఉంటారు అని కొనియాడారు.. అదే విధంగా వేసవి వలన రక్తదాతల కొరత ఎక్కువగా ఉంటుంది అని దయచేసి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి రక్తధానం చేయాలి ప్రాణధాతలుగా నిలవాలి అని పిలుపునిచ్చారు..
admin1

Masapogu Eswaraiah... Akhanda Bhoomi.. Telugu Daily News.. Telugu Web News.. Edtior & Publisher.. Cell : 9441626873.

error: Content is protected !!