ఎస్పీ గా పదవీ భాద్యతలు స్వీకరించిన జి. కృష్ణకాంత్

కర్నూలు జిల్లా నూతన ఎస్పీ గా పదవీ భాద్యతలు స్వీకరించిన జి. కృష్ణకాంత్

కర్నూలు క్రైమ్, ఏప్రిల్ 12, (అఖండ భూమి న్యూస్):

జి. కృష్ణ కాంత్ ఐపియస్  కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు.ముందుగా జిల్లా ఎస్పీ కి పోలీసు అధికారులు, ఎఆర్ సిబ్బంది స్వాగతం పలికి గౌరవందనం చేశారు. జిల్లా ఎస్పీ . జి. కృష్ణకాంత్ ఐపియస్  పదవీ భాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర డిజిపి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.

జిల్లా ఎస్పీ జి. కృష్ణ కాంత్ ఐపియస్ గారి గురించి .

స్వస్ధలం … అనంతరం పురం జిల్లా , గుత్తి మండలం, SS పల్లె గ్రామం.

పదో తరగతి వరకు అనంతపురం జిల్లా గుత్తి జడ్పీ పాఠశాలలో , గుంతకల్లులోని శంకరానంద స్వామి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ , అనంతపురం పట్టణంలోని సీఎంఐ కళాశాలలో బీఎస్సీ బయో టెక్నాలజీ , హర్యానా లోని నేషనల్ డైరీ రీసెర్చి ఇన్స్టిట్యూట్ లో ఎంఎస్సీ బయోటెక్నాలజీ పూర్తి చేశామన్నారు. సివిల్స్ రాసి 2017 బ్యాచ్ ఐపియస్ కు ఎంపికయి ఆంధ్ర క్యాడర్ కు రావడం జరిగిందన్నారు. ఐపియస్ శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో 9 నెలల పాటు చింతూరు ఏఎస్పీగా, అల్లూరి సీతా రామరాజు జిల్లా రంపచోడవరం లో 1 సంవత్సరం పాటు ఒయస్డీ గా పని చేయడం జరిగిందన్నారు. గోదావరి మావోయిస్టు ప్రాంతాలలో 2 సంవత్సరాలు పని చేయడం జరిగిందన్నారు. గంజాయి నివారణకు ప్రత్యేక దృష్టి సారించామన్నారు. కర్నూలు జిల్లాలో 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యల పై మా వంతుగా సత్వర చర్యలు తీసుకుంటామన్నారు. మహిళల భధ్రత, రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, ఇల్లిగల్ యాక్టివిటిస్ పై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. రాయలసీమ వాసి గా కర్నూలు జిల్లాకు రావడం సంతోషంగా ఉందన్నారు. మిడియా సహాకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సెబ్ అడిషనల్ ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్ ఐపియస్ , అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డి. ప్రసాద్, డిస్పీలు వెంకటాద్రి, వెంకట్రామయ్య, నాగభూషణం, యుగంధర్ బాబు, వినోద్ కుమార్, కెవి మహేష్, ఇలియాజ్ భాషా, డిపిఓ ఎఓ సురేష్ బాబు, సిఐలు ఉన్నారు.
admin1

Masapogu Eswaraiah... Akhanda Bhoomi.. Telugu Daily News.. Telugu Web News.. Edtior & Publisher.. Cell : 9440912389

error: Content is protected !!