ఆక్రమణకు అనర్హంకాదేది
యర్రగొండపాలెం, :మాజీ మంత్రి అండదండలతో రాళ్ళవాగు ప్రవెట్ బ్రిడ్జి పక్కన వైసీపీ వారు కట్టిన పార్కు స్దలం మాదేనంటు దలిత కుటుంబానికి చెందిన పేదలు తహాశీల్దారు కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. ప్రకాశంజిల్లా యర్రగొండపాలెం పట్టణం దగ్గరలోని మిల్లంపల్లి ఇలాఖా రాళ్ళవాగు పై వైసీపీకి చెందిన అప్పటి మంత్రి అండదండలతో ఇక్కడి పొలం యజమాని దాదాపుగా సొంతంగా కోటీ రూపాయాలతో బ్రిడ్జి నిర్మించిన విషయం విధితమే. మంత్రి చేసిన మేలు కు ఆ వంతెనకు మంత్రి పేరు పెట్టిన విషయము కూడ విధితమే. అయితే ఇక్కడే ఇటివల తరచు కోర్టులో రాజకీయ నాయకుల కేసుల విషయంలో వాడే పథం క్విడ్ ప్రోకో అచ్చంగా అలాంటి క్విడ్ ప్రోకో నే ఇక్కడ జరిగినట్లు పుంఖాలు పుంఖాలుగా కథనాలు బయటకు వస్తున్నాయి. అలాంటి వారికి మంత్రి సహాయం చెయడం కోసం ఎందరో పేదలను బలిచేసారనే విషయం కూడ బయట పడుతుంది.దానికి ఓ ప్రణాళికను సిద్దం చెసి ఏపి గ్రీవింగ్ భ్యూటిఫికేషన్ కార్పోరేషన్ పేరుతో విశాఖ పట్టణంలోని రిషికొండ తోపాటు యర్రగొండపాలెం పట్టణంలోని ఈ రాళ్ళవాగు ను చేర్చి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పేరుతో 5 ఎకారాల పేదల భూమిని కొట్టెసి 120 సెంట్ల స్దలంలో పార్కు పేరుతో1.50 కోట్ల నిధుల మంజూరు చెయించారనే విషయం తెలుస్తుంది.వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటం ఈ నియోజక వర్గం మంత్రి అడ్డ కావాడంతో బయపడిన పేదలు నొరెత్తకుండ ఉండిపోయారని, ఇప్పుడు ప్రభుత్వం మారిన తరువాత మంత్రి చేతులలో బలియిన పేదలు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు.ఇలాంటి గతం తాలుకు అర్జీలతో న్యాయం చెయలేని తహాశీల్దారులు తలపట్టు కుంటున్నారు .కొందరయితే బదీలీపై వెళ్ళిపోతున్నారు.