జిల్లా వైద్యాధికారి సుడిగాలి పర్యటన.
జి. మాడుగుల నవంబర్ 2.అఖండ భూమి.
అల్లూరి సీతారామరాజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ జిల్లా అధికారి జి.మాడుగుల మండలం లో సుడిగాలి పర్యటన చేశారు. కే. కోడపల్లి సచివాలయం, మత్స్య పురం, జి.మాడుగుల 01 సచివాలయం, గాంధీ నగరం లో చిన్నపిల్లల టీకాలను పరిశీలించారు. జిమాడుగుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సందర్శించి స్కూల్ హెల్త్ బుక్స్ మరియు చిన్నపిల్లల వ్యాక్సిన్ ను పరిశీలించారు. గర్భవతులను వారు తీసుకోవాల్సిన ఆహారం బాలింతలను ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సి జమాల్ బాషా మరియు జిమాడుగుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి వారు డాక్టర్ ఈ రవిచంద్రశేఖర్ ఆరోగ్య విస్తరణ అధికారి ఎన్ ప్రకాశరావు మరియు వైద్య సిబ్బంది పాల్గొనడం జరిగింది



