అక్రమ పండ్ల దుకాణాలపై పోలీస్.. మున్సిపల్ అధికారుల కొరడా..
-కబ్జాదారుల దుకాణాలను ముచ్చటగా నాలుగో సారి తొలగింపు..?
-హర్షం వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు..
-మళ్లీ కబ్జా కాకుండా చూస్తారా..
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి నవంబర్: 11 (అఖండ భూమి) ఆర్మూర్ పట్టణంలో లక్షలు ఖర్చుచేసి నిర్మాణం చేసి కొత్త బస్టాండ్ ప్రాంతం ఫుట్ పాత్ లను పండ్ల వ్యాపారులు కబ్జా చేసి.. ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగిస్తున్నారని పండ్ల దుకాణాలను ఎట్టకేలకు సోమవారం పోలీస్.. మున్సిపల్ అధికారుల సమన్వయంతో జెసిపి తో పండ్ల దుకాణాలను తొలగించారు. గతం లో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్.కమిషనర్ ప్రసాద్ చౌహన్. ప్రస్తుత కమిషనర్ రాజు హయంలలో వరుసగా నాలుగు సార్లు తొలగించిన మున్సిపల్. పోలీస్ శాఖ వారు మళ్లీ అటువైపు నిఘా పెట్టకపోవడంతో పండ్ల వ్యాపారులు మళ్లీ ఫుట్ పాత్ లను కబ్జా చేయడం దుకాణాలు ఏర్పాటు చేసుకోవడం అనివార్యంగా మారింది. కొత్తగా వచ్చిన
ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్. టౌన్ ప్లానింగ్ అధికారి ఆంజనేయులు దగ్గరుండి పండ్ల దుకాణాలను తొలగింప చేశారు. ఈసారైనా పోలీస్. మున్సిపల్ అధికారులు ఫుట్ పాత్ కబ్జా జరగకుండా చూస్తారా అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది.
సీఐ సత్యనారాయణ గౌడ్ ఏమన్నారంటే..
పండ్ల దుకాణాల వ్యాపారస్తులు అక్రమంగా వేసుకున్న షెడ్డులను స్వచ్ఛందంగా తొలగించుకొని సెట్ బ్యాక్ తీసుకొని దుకాణాలను పెట్టుకోవాలని సూచించారు. జెసిపి తో తొలగిస్తే ఆస్తి నష్టం జరుగుతుందని పండ్ల దుకాణదారులు సహకరించాలని ఆయన కోరారు.
You may also like
-
బ్రోకర్లు ను నమ్మి మోసపోవద్దని వన్ టౌన్ సీఐ వర ప్రసాద్ హెచ్చరిక
-
శ్రీశైలం దేవస్థానం దర్శనార్థం వచ్చే భక్తులు బ్రోకర్లు నమ్మి మోసపోవద్దని టూ టౌన్ హెచ్చరిక హెచ్చరిక
-
కామారెడ్డి జిల్లాలో ఆర్టీఏ చెక్ పోస్ట్ పై ఏసీబీ దాడులు..!
-
ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక అవసరం ఉన్న లబ్ధిదారులు జిపి కార్యదర్శికి దరఖాస్తు చేసుకోవాలి…
-
గవర్నర్ చే డాక్టరేట్ అందుకున్న డాక్టర్ బాలు…