బాసర ట్రిపుల్ ఐటీ లో విద్యార్థిని ఆత్మహత్య..
-పెర్కిట్ కు చెందిన స్వాతి (18) ప్రియ గా గుర్తింపు..
-తల్లిదండ్రులు రాకముందే మార్చురీకి తరలించిన పోలీసులు..
-కాలర్ పట్టుకుని పోలీసును నిలదీసిన తల్లి..
-కూతురిది ఆత్మహత్య కాదు.. హత్య చేశారని తల్లి ఆరోపణ ..
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి నవంబర్: 11 (అఖండ భూమి) ఆర్మూర్. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ లో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ గ్రామానికి చెందిన స్వాతి ప్రియ (18) సోమవారం ఉదయం ఉరి వేసుకుని మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలిసిన తల్లిదండ్రులు బాసర ట్రిపుల్ ఐటి కళాశాలకు వెళ్లే లోపే స్వాతి ప్రియా మృతదేహాన్ని పోలీసులు మార్చురీకి తరలించడంతో కోపోద్రిక్తురాలైన తల్లి పోలీస్ కాలర్ పట్టుకుని తాము రాకముందే మార్చురీకి ఎలా తరలిస్తారని నిలదీసింది. స్వాతి ప్రియ ది ఆత్మహత్య కాదు హత్య అని. కూతురిని చంపేశారని ఆవేశంగా ఆరోపించింది. తల్లిదండ్రులు రాకముందే మార్చురికి తరలించడంపై కళాశాల విద్యార్థులు బంధువులు. ప్రజలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. చదువుల్లో చక్కగా రాణిస్తూ. ఆటపాటలతో పాటు ఎంతో కలుగునుపుగా ఉండే స్వాతి ప్రియ లేదని తెలిసి బంధుమిత్రులు రోధిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
You may also like
-
ప్రజా విజయోత్సవ రైతు పండుగ తరలి వెళ్లిన. తుర్కపల్లి మండల రైతులు.
-
బాల్య మిత్రులను కలిసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే.బీర్లఐలయ్య
-
బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసిన. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
-
రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడియ్య కు అభినందనలు తెలిపిన రాక్స్ సెక్రెటరీ కొండ్రు కళ్యాణ్