నకిలీ విలేకరుల ఆట కట్టించండి

 

 

నకిలీ విలేకరుల ఆట కట్టించండి

జిల్లా ఎస్పీ ని కోరిన ఫెడరేషన్ నాయకులు

అనకాపల్లి : సోషల్ మీడియా పేరుతో హల్ చల్ చేస్తున్న నకిలీ విలేకరుల ఆగడాలకు అడ్డుకట్టవేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రతినిధులు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ను కోరారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బి. వెంకటేష్ మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా పరిధిలో నకిలీ విలేకరుల హవా ఎక్కువగా ఉందని, బైకులపై, కార్లపై ప్రెస్ స్టిక్కర్స్ పెట్టుకుని ఛలామణి అవుతున్నారని అన్నారు. దీనిపై సత్వర చర్యలు చేపట్టి నకిలీ విలేకరుల బెడద నివారించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సదరు రిపోర్టర్ అక్రిడేషన్ కార్డు లేదా పత్రికల యాజమాన్యాలు ఇచ్చిన ఐడెంటిటీ కార్డు విధిగా పోలీసులకు చూపాలి. లేనిపక్షంలో సదరు వాహనాన్ని సీజ్ చేసి నకిలీ గా చెలామణీ అవుతున్న వ్యక్తి పై కేసులు నమోదు చేయాలని కోరారు. అలాగే అధికారిక కార్యక్రమాలకు సోషల్ మీడియా ప్రతినిధులు హాజరు అవుతున్నారని, ఈ కారణంగా నిజమైన జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారని, అటువంటి కార్యక్రమాలకు చెక్ పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు భాషా, జూమ్ శేఖర్, నాగ, నటరాజ్, నాగు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!