హాస్టల్ వార్డెన్.. కుక్.. వాచ్మెన్.. స్లీపర్ లపై బదిలీ వేటు..
-హాస్టల్ పిల్లల పట్ల దురుసుగా ప్రవర్తించడమే కారణం..
-ప్రజావాణి లో ఫిర్యాదు చేసిన బీసీ సంఘం జిల్లా కార్యదర్శి ద్యాగ శేఖర్..
-తనిఖీ చేసి వేటు వేసిన బీసీ డెవలప్మెంట్.. బీసీ వెల్ఫేర్ అధికారులు..
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి నవంబర్: 12 (అఖండ భూమి) ఆర్మూర్ పట్టణం రామ్ నగర్ లోని వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహంలో వార్డెన్ శ్యామల విద్యార్థులకు పప్పు నీళ్ల చారు. విద్యార్థులతో వెట్టి చాకిరి చేయిస్తున్నారని. కుక్. వాచ్మెన్ స్వీపర్ విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ. ప్రశ్నిస్తే విద్యార్థులకు చితకబాదుతున్నారని విద్యార్థులు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించిన వీడియోలు వైరల్ కావడంతో బిసి విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి ద్యాగ శేఖర్ సోమవారం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో జిల్లా బీసీ డెవలప్మెంట్ అధికారి స్రవంతి. అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారి గంగాధర్ నరసయ్యలను విచారణ చేయాలని ఆదేశించగా విచారణ చేసిన అధికారులు హాస్టల్ వార్డెన్ శ్యామల. కుక్. వాచ్మెన్. స్వీపర్లను బదిలీ చేసినట్లు తెలిసింది. ఇలా ఒకచోట అనే కాదు చాలా హాస్టల్లో నమ్ముకుని వచ్చిన విద్యార్థులకు సొంత పిల్లల్లాగా చూసుకునే వసతి గృహాల వార్డెన్లు ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తూ. పిల్లల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ దేవాలయాల లాంటి హాస్టల్ లకు చెడ్డ పేరును తెస్తున్నారు. ఇప్పటికైనా హాస్టల్ వార్డెన్లు స్పందించి విద్యార్థులకు ప్రేమానురాగాలు పంచాలి కానీ భయపెట్టవద్దని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…