చేసేది అక్రమ నిర్మాణం.. పైగా బెదిరింపులు..

 

చేసేది అక్రమ నిర్మాణం.. పైగా బెదిరింపులు..

-ఏ ల..జ కొడుకు వస్తాడో చూస్తా..

-ఎవడ్రా నా పనులు ఆపేది..

-వాళ్లైనా ఉండాలి.. మేమైనా ఉండాలి..

-భూ కబ్జా దారుడు బెదిరింపులు..

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి డిసెంబర్ 03: (అఖండ భూమి న్యూస్) ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని రాజారాం నగర్ 26వ. వార్డులో ప్లాట్ నెంబర్ 192.. సర్వేనెంబర్ 425/2 భూమి కోర్టు పరిధిలో ఉన్న దంతాల సాయిప్రసాద్ పట్టా భూమిని కబ్జా చేసి రాత్రుల్లో అక్రమ నిర్మాణం చేస్తుండటమే కాకుండా ఎవడ్రా పనులు ఆపేది.. ఏ ల.. జా కొడుకు వస్తాడో చూస్తా అంటూ కబ్జాదారుడు సంబడి ఆనంద్ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. స్థల యజమాని దంతాల సాయి ప్రసాద్ కు.. సంబంధిత అధికారులను భయపెట్టేందుకు గ్యాస్ నూనె పోసుకుని నిప్పంటించుకుంటానంటూ బెదిరిస్తున్నాడు. సంబంధిత అధికారులు.. అక్రమ నిర్మాణమని తెలిసిన అటువైపు వెళ్లలేక పోతున్నారు. కాలనీవాసులు కూడా వెళ్ళలేకపోతున్నామని ఆరోపిస్తున్నారు. సంబడి ఆనంద్ ఆగడాలను పోలీసులే అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు..

Akhand Bhoomi News

error: Content is protected !!