రియాల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య ఘర్షణ ఒకరికి తీవ్ర గాయాలు
బెల్లంపల్లి డిసెంబర్ 09(అఖండ భూమి):బెల్లంపల్లి లో రియల్టర్స్ మధ్యలో గొడవాలో ఒకరికి గాయాలు వివరాల్లోకి వెళితే ఆదివారం రాత్రి పట్టణంలోని కెమికల్ జాతీయ రహదారి వద్ద రియాల్టర్ మధ్య డబ్బుల పంపకం విషయంలో ఘర్షణపడ్డారు. ఆ ఘర్షణలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.తాగిన మైకంలో బూడిదగడ్డ బస్తికిచెందిన ఆశ సంతోష్ అనే వ్యక్తిపై కామెర రాజు, అఖిల్ అనే వ్యక్తులు భీరు సీసా,కత్తితో దాడీ చేసారు.దాడిలో తీవ్రంగా గాయపడిన ఆశ సంతోష్ ను బెల్లంపల్లి ప్రభుత్వ అస్పత్రికి తరలించారు.
ప్రాథమిక వైద్యం అందించి మెరుగైన వైద్య నిమిత్తం మంచిర్యాల లోని ప్రైవేట్ అస్పత్రికి తరలించారు.ఈ సంఘటన పై పోలీస్ లు దర్యాప్తు చేస్తున్నారు…