మాదిగ హక్కుల దండోరా జిల్లా ముఖ్య నాయకుల సమావేశం

 

మాదిగ హక్కుల దండోరా జిల్లా ముఖ్య నాయకుల సమావేశం

బెల్లంపల్లి డిసెంబర్ 21(అఖండ భూమి ):బెల్లంపల్లి పట్టణం లోని ఎస్సి కమ్యూనిటీ హాల్ ఆకునూరి రాజ్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన మాదిగ హక్కుల దండోరా జిల్లా సమావేశం జరిగినది.

ఈ యొక్క సమావేశానికి మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిలుక రాజనర్సు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాదిగ హక్కుల దండోరా మంచిర్యాల జిల్లా కమిటీ సూచన మేరకు,గతంలో బెల్లంపల్లి నియోజక వర్గ ఇన్చార్జి గా చేసిన సేవలను గుర్తించి ఇడిగిరాల ప్రసాద్ ను జిల్లా కార్యదర్శి గా మరియు కెల్లెపల్లి నవీన్ని బెల్లంపల్లి నియోజక వర్గ అధ్యక్షుడు గా , రాసపల్లి శంకర్ ని బెల్లంపల్లి పట్టణ(దివ్యంగుల)

అధ్యక్షుడిగా రాష్ట్ర కమిటీ

నియమించడం జరిగింది.

మంచిర్యాల జిల్లా లోని అన్ని మండలాల జిల్లా పరిధిలో మాదిగ హక్కుల దండోరా కమిటీలను నిర్మాణం చేసి జాతి ఐక్యత కోసం హక్కుల కోసం ఆత్మ గౌరవం కోసం నిరంతరం కృషి చేయాలని పిలుపునిస్తున్నాము

ఈ సందర్భంగా చిలుక రాజనర్సు మాట్లాడుతు.. 01 ఆగస్టు 2024 న భారత దేశ అత్యున్నత న్యాయస్థానం చంద్ర చూడ్ గారి అధ్యక్షతన 7 గురు ధర్మాసనం తీర్పు వెలువడిన వెంటనే స్పందించి మన రాష్ట్ర ముఖ్య మంత్రి గౌ శ్రీ.రేవంత్ రెడ్డి మొట్టమొదట అత్యున్నత న్యాయస్థానం తీర్పును మన రాష్ట్రంలోనే అమలు పరుస్తమననీ నిండు అసెంబ్లీ లో ప్రకటించిన విధంగా వెంటనే అమలు చేయాలని మన రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నీ మాదిగ హక్కుల దండోరా డిమాండ్ చేస్తుంది.రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం ఎస్సి వర్గీకరణ. రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందాలని .విద్య, ఉద్యోగ,రాజకీయ రంగాల్లో ఎవరి వాటా వారికే దక్కాలని కోరారు

ఈ కార్యక్రమంలో అరికిళ్ల దుర్గయ్య

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

కాంపల్లి రాజం రాష్ట్ర కార్యదర్శి

ఆకునూరి రాజ్ కుమార్

జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరెపల్లి రమేష్

పట్టణ గౌ.అధ్యక్షుడు ఎనగందుల శివాజీ

పట్టణ అధ్యక్షుడు సంగే సారయ్య

పట్టణ కార్యదర్శి.అంబాల రాజు

కోశాధికారి వేముల మల్లేష్

వార్డు అధ్యక్షుడు మహేష్

వార్డు అధ్యక్షుడు అరేపల్లి సతీష్

నాతరి భీమయ్య చిలుక పోషం

తదితరలు పాల్గొన్నారు…

Akhand Bhoomi News

error: Content is protected !!