అంగరంగ వైభవంగా పుట్టినరోజు వేడుకలు

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రం నందు పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్దుర్తి టిడిపి కార్యాలయం నందు 50 కేజీల కేక్ తో మండలంలోని టిడిపి కార్యకర్తలు టిడిపి సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డి పల్లె సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్దుర్తి ప్రభుత్వ వైద్యశాల నందు రోగులకు పాలు పండ్లు బెడ్లు పంపిణీ చేశారు. అనంతరం బొమ్మిరెడ్డి పల్లె సుబ్బరాయుడు మాట్లాడుతూ.. మన ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు 48 వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపామన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండి పత్తికొండ నియోజకవర్గం ప్రజలకు ఎంతో సేవలందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి టిడిపి మండల అధ్యక్షులు టి. బలరాం గౌడ్, మాస పోగు బజారు, సుధాకర్ గౌడ్, పుల్లగుమ్మి నాగేశ్వర్ రెడ్డి, గుంటిపల్లె వెంకటరాముడు, రామళ్లకోట రామకృష్ణ ఆచారి, అల్లు గుండు బాలమది, రాఘవేంద్ర, బాలరాజు, మోష, తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!