పూర్తికావస్తున్న అంకాపూర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు..

 

పూర్తికావస్తున్న అంకాపూర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు..

-ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రత్యేక చొరవతో..

-2015 నవంబర్ 9న. శంకుస్థాపన..

-మంజూరైనవి 165 ఇళ్ళు..

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి డిసెంబర్: 26 (అఖండ భూమి న్యూస్) ఆర్మూర్.. ఆర్మూర్ మండలం ఆదర్శ అంకాపూర్ గ్రామంలో పేదలకు రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు అందచేయడానికి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రత్యేక చొరవతో పనులు వేగవంతంగా సాగుతున్నాయి. దశాబ్దాలుగా అద్దె ఇళ్లలో ఉంటున్న పేద ప్రజల సొంతింటి కల సాకారం కానుంది. కూలీనాలీ చేసుకుని జీవించే పేదలు అద్దెలు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. మరో నెలలో ఇలా నిర్మాణం పూర్తి చేయాలని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. అధికారులను. కాంట్రాక్టర్ ను ఆదేశించారు. 2014 ఆగస్టు 7న. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామానికి వచ్చి రైతులు. గ్రామ ప్రజలతో ముఖాముఖి నిర్వహించి 165 రెండు పడక గదుల ఇల్లు నిర్మాణం కు హామీ ఇచ్చారు. కాగా ఇళ్ళ నిర్మాణం ప్రారంభం కావడంలో జాప్యం జరిగింది. 2015 నవంబర్ 9న. అప్పటి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ. ఆనాటి ఎంపీ కవిత. అప్పటి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పనులకు శంకుస్థాపన చేశారు. ఇందుకోసం కేటాయించిన స్థలం అణువుగా లేదని కొన్నాళ్లు పనులు చేపట్టలేదు. తర్వాత జాతీయ రహదారి పక్కన స్థలం ఖరారు చేశారు. కాంట్రాక్టర్ పనులు ప్రారంభించి. పునాదులు తవ్వి వదిలేశారు. అధికారులు మరో కాంట్రాక్టర్ శ్రీనివాస్ చారికి బాధ్యత అప్పగించడంతో కొన్నాళ్లు పనులు సాగాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహిస్తూ నత్త నడకన పనులు చేస్తుండడంతో గదుల నిర్మాణం లో ఆలస్యం జరిగిందని. సొంతింటి కల సాకారం కాకముందే ఇద్దరు లబ్ధిదారులు చనిపోయారని విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆగ్రహించి కాంట్రాక్టర్ శ్రీనివాస్ చారికి ఇళ్ల నిర్మాణం త్వరిత గతిన పూర్తి చేయాలని పలుమార్లు మందలించిన వినకపోవడంతో ఇప్పుడు మరో కాంట్రాక్టర్కు పనులు అప్పగించి నెలలోపు రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. ప్రస్తుత కాంట్రాక్టర్ పూర్తయిన 96 గదులకు రంగులు. విద్యుత్. తలుపుల పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.

-త్వరలో ఇలా నిర్మాణం పూర్తి చేయిస్తాం..

మంజూరైన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం వేగంగా కొనసాగుతుంది. అధికారులపై. కాంట్రాక్టర్ పై ఒత్తిడి పెంచి పనులు వేగవంతం చేయించా. ఇలా నిర్మాణం పూర్తి కాగానే లబ్ధిదారులకు అందజేస్తాం..

ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి..

Akhand Bhoomi News

error: Content is protected !!