వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి
యర్రగొండపాలెం అఖండ భూమి.
యర్రగొండపాలెం : రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నట్లు ఎస్సై పి చౌడయ్య తెలిపారు. 565 నేషనల్ హైవేపై సోమ వారం ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వెళ్లే నేషనల్ హైవేపై ముఖ్యమైన జంక్ష న్లలో ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. వాహ నాలను నడిపేటప్పుడు ప్రతి ఒక్కరు జాగ్రత్తలు వహించాలన్నారు.అతి వేగంతో వాహ నాలు నడిపి ప్రాణాలను పోగొట్టుకోవద్దని సూచించారు. అదేవిధంగా ఫేస్వాష్ కార్య క్రమాన్ని కూడా చేపడుతున్నట్లు తెలిపారు. అర్ధరాత్రి రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు హైవేపై వెళ్లే వాహనాలను ఆపి డ్రైవర్లకు ముఖం కడిగించి వారిని నిద్ర మత్తు నుండి లేపి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకుంటు న్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
You may also like
-
మాదిగ హక్కుల దండోరా జిల్లా ముఖ్య నాయకుల సమావేశం
-
చోరీ కేసులో నిందితుల అరెస్టు.. రిమాండ్ కు తరలింపు
-
రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరిడియ్య కు అభినందనలు తెలిపిన రాక్స్ సెక్రెటరీ కొండ్రు కళ్యాణ్
-
*ప్రభుత్వ విఫ్ ఆదేశాలతో* *దిగివచ్చిన ఫార్మా కంపెనీలు*
-
ఎస్సీ వర్గీకరణ ఏక సభ్య కమిషన్ ను తక్షణమే రద్దు చేయాలి – డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్