చోరీ కేసులో నిందితుల అరెస్టు.. రిమాండ్ కు తరలింపు

 

చోరీ కేసులో నిందితుల అరెస్టు.. రిమాండ్ కు తరలింపు

యర్రగొండపాలెం అఖండ భూమి

యర్రగొండపాలెం (మండలం) తాళాలు వేసిన ఇళ్లల్లో చోరీ చేసిన కేసులో ఓ వ్యక్తిని… సోలార్ బ్యాటరీలు దొంగతనం కేసులో ఓ ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని యర్రగొండపాలెం సిఐ సిహెచ్ ప్రభాకర్ సోమవారం సాయం త్రం పత్రిక సమావేశంలో తెలియజేశారు… సీఐ తెలిపిన వివరాల ప్రకారం… కొలుకుల గ్రామానికి చెందిన ముండ్ల రామయ్య (24)అనే వ్యక్తి మండలం లోని గుర్రపుశాల గ్రామంలోని వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్లి అక్కడే కొద్ది రోజులుగా ఉంటున్నారని బెట్టింగ్లకు బానిసైన నిందితుడు దొంగతనాలకు అలవాటు పడ్డాడని తెలిపారు. కొంతమంది ఇంటికి తాళాలు వేసుకొని కూలి పనుల కోసం కొండేపి, హైదరాబాద్,మరియు నాగర్ కర్నూల్ వైపు ఆ గ్రామంలోని వాళ్ళు వెళు తుంటారని. ఈ క్రమంలో నిందితుడు ఆ తాళాలు పగలగొట్టి గ్రామంలోని 12 ఇండ్లల్లో దొంగతనానికి పాల్పడినట్టు విచారణలో తేలిందని అన్నారు. గత నెల 29న ఆ గ్రామానికి చెందిన బడిపాటి ఏసోబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి నిందితున్ని నుండి ఆరు లక్షల అరవై వేల రూపాయలను నగదును పోలీస్ లు స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని పాలుట్ల మరియు పొన్నల బైలు గ్రామాలలోని సోలార్ బ్యాటరీలు దొంగతనానికి గురయ్యాయని యర్రగొండపాలెం కరెంటు ఏఈ అక్టోబర్ 11న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని. వారిని కాకినాడ జిల్లాకు చెందిన కొప్పాక ప్రసన్నకుమార్ (31), అల్లూరి సీతారామ జిల్లాకు చెందిన పిండి రామకృష్ణ (39) గా గుర్తించామన్నారు. వీరిద్దరూ సుమారు 600 బ్యాటరీలను స్క్రాప్ కింద హైదరాబాదులో మూడు లక్షల రూపాయల కు అమ్మినట్లుగా ఆయన తెలిపారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని రిమాండ్ నిమిత్తం మార్కాపురం కోర్టుకు హాజరు పరిచామని సీఐ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కేసులను ఛేదించిన ఎస్సై చౌడయ్యను వారి సిబ్బంది ఎస్.కె కాసిం, జి అనిల్ కుమార్ ను సీఐ అభినందనలు తెలియజేశారు.

Akhand Bhoomi News

error: Content is protected !!