రాజకీయాలకు తొత్తుగా మారిన దోర్నాల తహసిల్దార్ ..

 

రాజకీయాలకు తొత్తుగా మారిన దోర్నాల తహసిల్దార్ ..

శృతి మించిన ఎమ్మార్వో కిన్నెర శాంతి ఆగడాలు…

అఖండ భూమి వెబ్ న్యూస్ :

ప్రకాశం జిల్లా దోర్నాల మండలం తహసిల్దార్ రాజకీయా నాయకులకు తొత్తుగా మారి వారు చెప్పింది వేదము గా పనిచేస్తూ భూమిపై హక్కు ఉన్నా కూడా ఒకరు భూమిని మరొకరికి ముట్ట చెబుతూ మూడో కంటికి తెలియకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ బాధితుల బాధ పట్టించుకోని ప్రభుత్వ అధికారి కిన్నెర శాంతి.ప్రకాశం జిల్లా దోర్నాల మండలం ఎడవల్లి రెవిన్యూ గంటవానిపల్లి గ్రామం లో సర్వే నెంబర్ 543 లో ఒక ఎకరం పొలం అనుభవిస్తూ దాని మీద వచ్చు ఆదాయంతో ద్వారా జీవనం సాగిస్తున్న బాధితుడు ఇట్లుండగా ఆ గ్రామమునకు సంబంధించిన మాదిగ కులానికి చెందినా యలకపాటి ఏసురత్నం ఆ పొలం 20 సం. క్రిందట కొనుగోలు అనుభవం ఉన్నటువంటి బాధితుడి పొలాన్ని అదే గ్రామానికి చెందినటువంటి అగ్రకులస్తుడైన శింగంశెట్టి వెంకటసుబ్బయ్య(రిటైర్డు ఏ. ఎస్.ఐ)అనే అతనికి ముట్ట చెప్పాలని రాజకీయ నాయకులకు లోబడి వారికి తొత్తుగా మారి వారు చెప్పిందే వేదము గా పాటిస్తూ వారి వద్ద నుండి కొంత పైకం లంచంగా తీసుకొని ఎస్సి (మాదిగ)కులానికి చెందిన బాధితులు పొలాన్ని డాక్యుమెంట్లు అన్నీ ఉన్నా కూడా వాటిని చూడకుండా పక్కన పడేసి వారిని మాట్లాడనీయకుండా అగ్రకులస్తులే చెప్పినట్లుగా తహసిల్దార్ నడుచుకోవడం గమనార్హం.ఈ పొలం వివాదం మార్కాపురం కోర్టులో దావ(OS 477/2021)నడుస్తున్నా కూడా దోర్నాల ఎమ్మార్వో కిన్నెర శాంతి కోర్టు అధికారాన్ని ధిక్కరిస్తూ అగ్రకులస్తులైన శింగంశెట్టి వెంకటసుబ్బయ్యకు కోర్టు స్టే ఇవ్వకపోయినా కూడా వారి దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేకపోయినా కూడా నాయకుల మాటలు విని పొలంలో పైరు ఉన్నా కూడా పలుమార్లు అధికారులను పంపించి ఎస్సీ కులస్తుడైన యలకపాటి ఏసురత్నం ను తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్న ఎమ్మార్వో కిన్నెర శాంతి సమయానికి రాకపోవడం వచ్చినా బాధితులపై మండిపడుతూ సమస్య పరిష్కరించకుండా పదేపదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోవడంతో తమ గోడు పట్టించుకోమని అధికారులకు వెళ్ళబుచుకుంటున్న బాధితుడు యలకపాటి ఏసురత్నం ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చిన వాటిని పట్టించుకోకుండా చెత్తబుట్టలో పడేస్తారని వాపోతున్నారు. గత ఎమ్మార్వో వేణుగోపాలరావు పొలంలో పూర్తిగా సర్వే చేయించి ఇచ్చినటువంటి రిపోర్టు మరియు మార్కాపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్ రిజిస్టర్ కాఫీలు(978/2004), ఎన్కంబ్రెన్స్ సర్టిఫికెట్లు మరియు ఆర్.హెచ్ కాపీల తో 20 సంవత్సరాల అనుభవంతో ఎంజాయ్మెంట్ లో ఉన్నా కూడా ఎమ్మార్వో కిన్నెర శాంతి రాజకీయ మాటలకు లోబడి వారు చెప్పింది వేదము గా వింటూ ఎస్సీలకు అన్యాయం చేస్తూ తమ భూమి వేరే ఒకరికి ముట్టజెప్పుటకు తమ భూమిని అన్యాక్రాంతం చేయాలని చూస్తుందని బాధితుడు వాపోతున్నారు. అదేవిధంగా విధులకు హాజరు కాకపోవడం ఈమె సక్రమంగా పనిచేయడం లేదని 12 గంటలకు హాజరై 2 గంటల వరకు ఉండి ఆ తర్వాత కనిపించకుండా మాయమవుతున్నారనే ఆరోపణలు గతంలో చాలావరకు వెల్లు వెత్తాయి. సదరు సమస్యపై ఉన్నత అధికారులు సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేసి, ఆ కుటుంబానికి ప్రాణరక్షణ, భూ రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఏసురత్నం ఒక ప్రకటనలో కోరారు.

Akhand Bhoomi News

error: Content is protected !!